THEFTS : ఆటో నగర్‌లో దొంగల భయం
ABN , Publish Date - Sep 29 , 2024 | 11:58 PM
మండల కేంద్రంలోని ఆటోనగర్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. తరచూ రాత్రిళ్లు అక్కడి మెకానిక్ షాపుల్లోకి చొరబడి వాహనాల సామగ్రి ఎత్తుకెళ్లి, అమ్ముకుంటున్నారు. రిపేరీ కోసం వచ్చిన వాహనాల విలువైన సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్తుండటంతో మెకానిక్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడులో 44వ జాతీయ రహదారి పక్కన 554-2 సర్వే నెంబర్‌లో 33 ఎకరాల్లో ఆటో నగర్ ఉంది. ద్విచక్రవాహనం మినహా మిగతా అన్ని వాహ నాల రిపేరీకి మెకానిక్ షాపులు ఉన్నాయి.
రాత్రిళ్లు వాహన సామగ్రి ఎత్తుకెళ్తున్న దొంగలు
ఆందోళన చెందుతున్న మెకానిక్‌లు
రాప్తాడు, సెప్టెంబరు 29: మండల కేంద్రంలోని ఆటోనగర్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. తరచూ రాత్రిళ్లు అక్కడి మెకానిక్ షాపుల్లోకి చొరబడి వాహనాల సామగ్రి ఎత్తుకెళ్లి, అమ్ముకుంటున్నారు. రిపేరీ కోసం వచ్చిన వాహనాల విలువైన సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్తుండటంతో మెకానిక్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడులో 44వ జాతీయ రహదారి పక్కన 554-2 సర్వే నెంబర్‌లో 33 ఎకరాల్లో ఆటో నగర్ ఉంది. ద్విచక్రవాహనం మినహా మిగతా అన్ని వాహ నాల రిపేరీకి మెకానిక్ షాపులు ఉన్నాయి. వాహనాల రిపేరీకి కావాల్సిన అన్ని స్పేర్ పార్ట్స్ అక్కడే తొరుకుతాయి. జిల్లా నలు మూలల నుంచి రైతులు, ఇతర వాహనాల వారు ఇక్కడికి వచ్చి తమ వాహనాలు రిపేరీ చేయించుకుంటారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా వాహనాలు రిపేరీకి ఇక్కడకు వస్తారు. లారీలు, ట్రాక్టర్లు, ఐషర్లు, ఇత ర భారీ వాహనాల రిపీరీ ఒక్కో సారి ఒక్క రోజు లో పూర్తికాదు. దీంతో ఆ వాహనం కొన్ని రోజుల పాటు మెకానిక్ షాపులోని ఉండాల్సి వస్తుంది. అయి తే ఆటో నగర్‌లో ఇటీవల దొంగతనాలు ఎక్కువ య్యాయి. రాత్రి సమయం లో దొంగలు ముఖాలకు మాస్కులు వేసుకుని మె కానిక్ షాపుల్లోకి చొరబడి వాహనాల సామగ్రి ఎత్తుకెళ్తున్నారు. ట్రాక్టర్, ఐషర్ వాహనాలకు అమర్చిన బ్యాటరీలను విప్పి ఎత్తుకెళుతున్నారు.
ఐషర్ వాహనం లోని డీజిల్ చోరీ చేస్తున్నారు. పాత టైర్లు, వాహనాల ఇతర విలువైన సామగ్రి ని కాజేస్తు న్నారు. అటువంటప్పుడు ఆయా సామగ్రిని తాము కొనివ్వాల్సి వస్తోం దని మెకానిక్‌లు వాపోతున్నారు. ఆటో నగర్‌లో కొన్ని షాపులకు సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలు ముఖాలకు మాస్కులు వేసుకుని చోరీలు చేస్తున్నారు. గతంలో రాప్తాడు పోలీసులు రాత్రి సమయంలో ఆటో నగర్‌లో ర్యాండమ్‌గా గస్తీ నిర్వహించేవారు. అయితే ఇటీవల పోలీసులు గస్తీ నిర్వహించకపోవడం తో దొంగతనాలు ఎక్కువయ్యాయని మెకానిక్‌లు వాపోతున్నారు. ఆటో నగర్‌లో మరిన్ని సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు, పోలీసులు గస్తీ ని ర్వహిస్తే దొంగతనాలు జరగవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడు సీఐ శ్రీహర్ష మాట్లాడుతూ ఇటీవలే బదిలీపై రాప్తాడుకు వచ్చానని ఆటో నగర్‌లో దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మెకానిక్ షాపుల్లో సీసీ కెమెరాలు అమర్చే విధంగా చర్యలు తీసుకుంటమన్నారు.
ట్రాక్టర్‌కు ఉన్న బ్యాటరీ ఎత్తుకెళ్లారు - రిజ్వాన బాషా, ట్రాక్టర్ మెకానిక్
పది రోజుల క్రితం మా షాప్‌లో దొంగ చొరబడ్డాడు. ట్రాక్టర్‌కు ఉన్న బ్యాటరీ ని విప్పి ఎత్తుకెళ్లాడు. అది దాదాపు రూ. 6 వేలు చేస్తుంది. రైతులు రిపేరి కోసం వాహనాలు ఇక్కడ ఉంచితే దొంగలు ఎత్తుకెళ్లిన సామగ్రిని మేమే కట్టివ్వాల్సి వస్తోంది. నెల కిందట ట్రాక్టర్ ఇంజన హెడ్‌ను ఎత్తుకెళ్లారు.
200 లీటర్ల డీజిల్ ఎత్తుకెళ్లారు - టింకర్ పజిల్, ఐషర్ మెకానిక్
దాదాపు 20 రోజుల కిందట మా షాప్‌లో ఉన్న ఐషర్ వాహనంలో డీజిల్ ఎత్తుకెళ్లారు. ప్రతి రోజు లాగే ఆ రోజు సాయంత్రం షాపు గేటుకు తాళం వేసి వెళ్లాను. ఐచర్ వాహనంలో 200 లీటర్ల డీజిల్‌ను క్యానలలోకి పట్టుకుని ఎత్తుకె ళ్లారు. దాదాపు రూ. 20 వేలు నష్టం. ఆర్నెల్ల కిందట మా పక్క షాపులో పాత టైర్లను ఎత్తుకెళ్లారు.
ఐషర్ బ్యాటరీ అపహరించారు - సందాని, ఐషర్ మెకానిక్
మా షాప్‌లో ఇటీవల ఐషర్ వాహనంలో ఉన్న 30 లీటర్ల డీజిల్ కాజేశారు. కొన్ని నెలల కిందట ఉన్న ఐషర్ వాహనం బ్యాటరీ విప్పి ఎత్తుకెళ్లారు. ఆటో నగర్‌లో తరచు దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో మెకానిక్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....