Share News

COLLECTOR : అపార్‌పై ప్రత్యేక దృష్టిపెట్టండి : కలెక్టర్‌

ABN , Publish Date - Nov 17 , 2024 | 12:25 AM

విద్యార్థుల భవిష్యత్తుకు సం బంధించిన అపార్‌ జనరేషన పక్రియపై ప్రత్యేక దృష్టిపెట్టా లని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికారుల ను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం అ పార్‌పై సమీక్షించారు. జిల్లా లో ప్రతిరోజు 10వేల నుంచి 15వేల వరకు అపార్‌ జనరేషన జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

COLLECTOR : అపార్‌పై ప్రత్యేక దృష్టిపెట్టండి : కలెక్టర్‌
Talking Collector

అనంతపురంటౌన, నవంబరు 16(ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల భవిష్యత్తుకు సం బంధించిన అపార్‌ జనరేషన పక్రియపై ప్రత్యేక దృష్టిపెట్టా లని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికారుల ను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం అ పార్‌పై సమీక్షించారు. జిల్లా లో ప్రతిరోజు 10వేల నుంచి 15వేల వరకు అపార్‌ జనరేషన జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని జూనియర్‌ కళాశాలలు, పాఠశాలల్లో వేగంగా ఈ పక్రియ సాగేందుకు ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు చర్యలు చేపట్టాలన్నారు. అపార్‌ లో బర్త్‌ సర్టిఫకెట్‌ మంజూరుకు సంబంధించి నెలకొన్న సందేహాలపై డిజిటల్‌ అసిస్టెంట్లకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఈఓ ప్రసాద్‌బాబు, డీవీఈఓ వెంకటరమణనాయక్‌, ఆధార్‌నోడల్‌ ఆఫీసర్‌ నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


వందశాతం లక్ష్యసాధనకు కృషిచేయాలి

ప్రభుత్వం అప్పగించిన పఽథకాల లక్ష్యాలను వందశాత పూర్తిచేసేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అదికారులను ఆదేశించారు. ఆయన శనివారం కలెక్టరేట్‌ నుంచి డీపీఓ, డీఎల్‌డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్పనెన్స ద్వారా పలు ఆంశాలపై సమీక్షించారు. ప్రతి ఇంటికి సచివా లయ ఉద్యోగులు వెళ్లి ఇళ్ల జియో జియోకోఆర్డినేట్స్‌ అప్‌డేట్‌ను వందశాతం పూర్తిచేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 65.46 శాతం పూర్తయిందన్నారు. ప్రభుత్వపథకాలకు సంబంధించి లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌లింకు పెట్టి ఈకేవైసీ చేయించాలన్నారు. ఇదికూ డా జిల్లాలలో ఇప్పటికి 75.69శాతం మాత్రమే పూర్తి చేశారని, మిగిలిన దానిని మూడురోజులలో చేయించాలని ఆదేశించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 17 , 2024 | 12:25 AM