Share News

CLUB : అనంతపూర్‌ క్లబ్‌ అభివృద్ధికి ఎమ్మెల్యే రూ. 20లక్షలు

ABN , Publish Date - Dec 02 , 2024 | 12:21 AM

అనంతపూర్‌ క్లబ్‌పై ఉన్న అపోహలను తొలగిస్తూ, దాని అభివృద్ధికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ రూ.20లక్షల నిధులు చెల్లించేందుకు ముందుకు రావడం అభినందనీయమని సెక్రట రీ కేశవ రెడ్డి తెలిపారు. స్థానిక సుభాష్‌రోడ్డులోని అనంతపూర్‌ క్లబ్‌లో ఆదివారం సీనియర్‌ సభ్యుడు, బార్‌ అసోసియేషన కౌన్సిల్‌ మెంబర్‌ రామిరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

CLUB : అనంతపూర్‌ క్లబ్‌ అభివృద్ధికి ఎమ్మెల్యే రూ. 20లక్షలు
Secretary Keshav Reddy presenting the report in the meeting

కలెక్టర్‌ అనుమతి తర్వాతే ఎన్నికలు

సర్వసభ్య సమావేశంలో తీర్మానం

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): అనంతపూర్‌ క్లబ్‌పై ఉన్న అపోహలను తొలగిస్తూ, దాని అభివృద్ధికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ రూ.20లక్షల నిధులు చెల్లించేందుకు ముందుకు రావడం అభినందనీయమని సెక్రట రీ కేశవ రెడ్డి తెలిపారు. స్థానిక సుభాష్‌రోడ్డులోని అనంతపూర్‌ క్లబ్‌లో ఆదివారం సీనియర్‌ సభ్యుడు, బార్‌ అసోసియేషన కౌన్సిల్‌ మెంబర్‌ రామిరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. క్లబ్‌ సెక్రటరీ కేశవరెడ్డి కార్యదర్శి నివేదిక ప్ర వేశపెట్టారు. జిల్లా కలెక్టర్‌, క్లబ్‌ చైర్మన వినోద్‌కుమార్‌ అను మతించిన వెంటనే క్లబ్‌ పాలకవర్గం ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. క్లబ్‌ అభివృద్ధికి అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ రూ.20లక్షల నిధులు చెల్లిం చడానికి ముందుకు రావడం అభినందనీయమని ఏకగ్రీవంగా తీర్మానించారు. క్లబ్‌ సభ్యులం దరూ సమష్టిగా క్లబ్‌పై ఉన్న అపోహలు తొలగిస్తూ...అభివృద్ధి, సేవా కార్యక్రమాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని తీర్మానంలో పేర్కొన్నారు. క్లబ్‌ సహాయ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి ఎంవీ పాండురంగయ్య, కార్యవర్గ సభ్యులు ఇక్రము ద్దీన, రమేష్‌కుమార్‌, మేడా రామ్‌నాథ్‌, ఇషాక్‌ఆలీ, రాజశేఖర్‌ రెడ్డి, గల్లా హర్ష, సీనియర్‌ సభ్యులు షకీల్‌షఫీ, సింగవరం రవి, రాయల్‌మురళీ, రవిశంకర్‌, జయచంద్రనాయుడు, ఆడిటర్‌ మేగా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 02 , 2024 | 12:21 AM