Share News

TECHIE : ఉగ్ర అలజడి

ABN , Publish Date - May 22 , 2024 | 12:21 AM

ఎన్నికల గొడవలను ఆసరాగా చేసుకుని.. ఉగ్ర మూకలు దాడికి తెగబడాలని చూస్తున్నాయా..? జూన 5న రాష్ట్రంలో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలు.. రాయదుర్గంలో ఎనఐఏ దాడులు.. జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే జూన 4న కౌటింగ్‌ తరువాత రాజకీయ హింస జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. పోలీసు శాఖ అప్రమత్తమైంది. కార్డెన సర్చ్‌ పేరిట అనుమానితుల ఇళ్లను, పరిసరాలను ...

TECHIE : ఉగ్ర అలజడి
NIA officers are taking Suhil into custody in Rayadurgam

రాయదుర్గంలో టెకీ అరెస్టు

బెంగళూరు పేలుళ్లతో సంబంధం..?

ఎన్నికల వేళ జిల్లాకు కొత్త సమస్య

అప్రమత్తమైన పోలీసులు.. జిల్లా జల్లెడ

అనంతపురం క్రైం, మే 21: ఎన్నికల గొడవలను ఆసరాగా చేసుకుని.. ఉగ్ర మూకలు దాడికి తెగబడాలని చూస్తున్నాయా..? జూన 5న రాష్ట్రంలో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలు.. రాయదుర్గంలో ఎనఐఏ దాడులు.. జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే జూన 4న కౌటింగ్‌ తరువాత రాజకీయ హింస జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. పోలీసు శాఖ అప్రమత్తమైంది. కార్డెన సర్చ్‌ పేరిట అనుమానితుల ఇళ్లను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాయదర్గంలో నేషనల్‌ ఇన్వెస్టిగేషన ఏజెన్సీ(ఎనఐఏ) అధికారులు మంగళవారం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సుహిల్‌నును అదుపులోకి తీసుకున్నాయి. దీంతో కేంద్ర నిఘా విభాగం హెచ్చరికలు నిజమేనా...? అనే అనుమానం బలపడుతోంది. సుహిల్‌ బెంగుళూరులో పనిచేసిన సమయంలో ఉగ్రవాద సంస్థ నాయకుల గదిలో ఉన్నారని సమాచారం. వారితో పరిచయం సుహిల్‌ను ఉగ్రవాదానికి దగ్గర చేసినట్లు అనుమానిస్తున్నారు. సుహిల్‌ ఫోనను స్వాధీనం చేసుకున్న ఎనఐఏ అధికారులు.. అతని కాల్‌రికార్డ్స్‌, ఫొటోలు, వాట్సాప్‌ చాటింగ్‌ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. జిల్లాలో సుహిల్‌ ఒక్కడే ఉన్నాడా, మరికొందరు ఉన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.


అప్రమత్తంగా ఉండాల్సిందే..

ఎనఐఏ దాడులు.. సుహిల్‌ అరె్‌స్టతో అందరిలో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. జూన 4 నుంచి 19 వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖను ఎన్నికల సంఘం, నిఘా వర్గాలు హెచ్చరించాయి. కౌంటింగ్‌ తదనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాయి. అల్లర్లు, ప్రతీకార దాడులు జరిగే ప్రమాదం ఉందని, కట్టడి చేయాలని హెచ్చరించాయి. జిల్లాలో తాడిపత్రితో పాటు రాప్తాడు, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల్లో గొడవలు జరిగే ప్రమాదం ఉంది. దీంతో పోలీసులు ఆ ప్రాంతాలపై గట్టి నిఘా వేశారు. ఎన్నికల గొడవలను కట్టడి చేసేందుకు సిద్ధమౌతున్న పోలీసులకు ఎనఐఏ దాడులు.. ఉగ్ర మూకల ఆనవాళ్లు జిల్లాలో ఉండటం పెను సవాలుగా మారనుంది. సుహిల్‌ను ఎనఐఏ అదుపులోకి తీసుకోవడంతో పోలీస్‌ శాఖలో


అలజడి మొదలైంది. ఎన్నికల వ్యవహారంతోనే పిచ్చెక్కిపోతుంటే మళ్లీ ఇదెక్కడి గొడవ అని తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో గతంలోనూ ఎనఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కానీ అవన్నీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినవారికి సంబంధించినవే. కానీ తొలిసారిగా ఉగ్రవాదులతో సంబంధం ఉందన్న అనుమానంతో ఒకరిని అరెస్టు చేయడం కలకలం రేపుతోంది.

జల్లెడ పడుతున్న పోలీసులు

కార్డెన సెర్చ్‌ పేరిట జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ గౌతమి శాలి ఆదేశాల మేరకు అన్ని సబ్‌ డివిజన్ల పరిధిలోని సమస్యాత్మక గ్రామాలు, కాలనీల్లో మంగళవారం తనిఖీలు చేశారు. రౌడీషీటర్లు, పాత కేసుల్లో నిందితులు, ట్రబుల్‌ మాంగర్స్‌, అనుమానితుల ఇళ్లలో గాలించారు. అనంతపురం, తాడిపత్రి, నార్పల పోలీ్‌సస్టేషన్ల పరిధిలో ర్యాపిడ్‌ యాక్షన ఫోర్స్‌ ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాయి. ఇప్పటి వరకూ జిల్లాలో 381 మందిని బైండోవర్‌ చేశారు. 136 మంది రౌడీషీటర్లు, కిరాయి హంతకుల, ట్రబుల్‌ మాంగర్స్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. గొడవలు సృష్టించినా, ప్రేరేపించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - May 22 , 2024 | 12:22 AM