AP News: అనంత జిల్లాలోని రౌడీ షీటర్లకు నూతన ఎస్పీ గౌతమిశాలి హెచ్చరిక
ABN , Publish Date - May 19 , 2024 | 03:06 PM
అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన గౌతమిశాలి ఆదివారం తొలిసారి స్పందించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ముందుకు సాగుతామని మీడియా సమావేశంలో ఆమె చెప్పారు. ఎన్నికల కౌటింగ్ రోజున గొడవలు జరగకుండా చూస్తామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
అనంతపురం: అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన గౌతమిశాలి ఆదివారం తొలిసారి స్పందించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ముందుకు సాగుతామని మీడియా సమావేశంలో ఆమె చెప్పారు. ఎన్నికల కౌటింగ్ రోజున గొడవలు జరగకుండా చూస్తామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో తమ బృందాలతో చర్చిస్తామని అన్నారు. ఇప్పటికే జిల్లాలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని, సమస్యాత్మక ప్రాంతాలలో భద్రతను కట్టదిట్టం చేశామని వివరించారు.
జిల్లాలో ఉన్న రౌడీ షీటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా గౌతమిశాలి హెచ్చరించారు. సమస్యలు సృష్టించేవారు, సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని అన్నారు. కాగా ఎన్నికల సంఘం శనివారం జారీ చేసిన ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా గౌతమిశాలి నియమితులైన విషయం తెలిసిందే. కర్నూలు అడిషనల్ ఎస్పీగా, అనకాపల్లి ఎస్పీగా ఆమె పని చేశారు. కాగా ఈ నెల 13న అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాడిపత్రి పట్టణంలో చెలరేగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుడిని చేస్తూ జిల్లా ఎస్పీగా ఉన్న అమిత్ బర్డర్‌ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.