SCHOOL : ఆర్డీటీ భవనంలో ప్రభుత్వ పాఠశాల
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:00 AM
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళ పాటు నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చి ది ద్దామని ఉపన్యాసాలు హోరెత్తించింది. నాడు-నేడుతో విద్యార్థులకు అన్ని సౌకర్యాల నడుమ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని గొప్పలు చెప్పింది. వైసీపీ ప్రభుత్వం నాటి మాటలు నీటి మూటలేనని అనడా నికి మండలంలోని కల్లూరు ఆగ్రహారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నిదర్శనంగా నిలుస్తోంది.
ఒకే గదిలో ఐదు తరగతులు
శిథిలావస్థలో పాఠశాల భవనం
గార్లదిన్నె, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళ పాటు నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చి ది ద్దామని ఉపన్యాసాలు హోరెత్తించింది. నాడు-నేడుతో విద్యార్థులకు అన్ని సౌకర్యాల నడుమ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని గొప్పలు చెప్పింది. వైసీపీ ప్రభుత్వం నాటి మాటలు నీటి మూటలేనని అనడా నికి మండలంలోని కల్లూరు ఆగ్రహారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నిదర్శనంగా నిలుస్తోంది. కల్లూరు ఆగ్రహారంలోని ప్రాథమిక పాఠశాలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సుమారు 50 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలో ఇద్దరు టీచర్లు విద్యను బోధిస్తున్నారు. అయితే పాఠశాల పై భాగం పూర్తిగా పెచ్చుటూడి శిథిలావస్థకు చేరింది. దీంతో విద్యార్థులు భయం గుప్పిట్లో విద్యను కొనసాంచేవారు. అయినా నాడు-నేడు పేస్-1 , పేస్-2లో సైతం ఈ పాఠశాల మరమ్మతులు చేపట్టకపోవడం విడ్డూ రం. వైసీపీ ఐదేళ్ల పాలనలో శింగనమల నియో జకవ ర్గానికి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆమె ఏనాడూ ఈ పాఠశాల వైపు కన్నెత్తి చూసిన పాపన పోలేదని పలువురు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరు వాత స్థితిలవస్థకు చేరుకున్న భనవంలో విద్యార్థులకు ప్రమాదం పొంచిఉందని భావించిన విద్యాశాఖ అధికారులు సమీపంలో ఉన్న ఆర్డీటీ భవనంలో కి పాఠశాలను మార్చారు. అయితే ఒకే గది ఉండటంతో, అందులోనే ఐదు తరగతులకూ ఆ ఇద్దరు ఉపాధ్యా యినులు బోధిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి పాటుపడలేదని ఏన్డీఏ ప్రభుత్వమైనా తమ అందుకు కృషి చేయాలని ఆ గ్రామ ప్రజలు, విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం - తారా చంద్రానాయక్, ఎంఈఓ, గార్లదిన్నె
కల్లూరు ఆగ్రహారంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. పై కప్పు పెచ్చులూడి పడుతోంది. ప్రమాదం జరుగుతుందని ముందస్తు జాగ్రత్తగా సమీపంలో ఉన్న ఆర్డీటీ భనవంలో పాఠశా లను నిర్వహిస్తున్నాం. ఈ విషయాన్ని ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....