TDP : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Oct 31 , 2024 | 12:14 AM
రైతుల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి పేర్కొన్నారు. మండలంలోని ఎంసీపల్లి పంచాయతీ ఏటిగడ్డ తిమ్మాపుురంలో బుధవారం రైతు గొల్ల ముత్యాలప్పకు సబ్సిడీ కింద మంజూరైన డ్రిప్ పరికరాలను ఆయన పంపిణీ చేశారు.
రామగిరి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి పేర్కొన్నారు. మండలంలోని ఎంసీపల్లి పంచాయతీ ఏటిగడ్డ తిమ్మాపుురంలో బుధవారం రైతు గొల్ల ముత్యాలప్పకు సబ్సిడీ కింద మంజూరైన డ్రిప్ పరికరాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ..గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నా రు. ప్రస్తుతం 90శాతం సబ్సిడీతో ప్రభుత్వం డ్రిప్ు అందజేస్తోందన్నారు. అర్హులైన రైతులందరికి సబ్సిడీ కింద వ్యవసాయ పరికరాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డ్రిప్ డీలర్ రవికుమార్, రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....