Share News

PAYYAVULA KESHAV : సంక్షేమ పాలనే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:37 AM

వైసీపీ నిరంకుశ పాలనతో గాడితప్పిన వ్యవస్థలను చక్కదిద్ది.. ప్రజా సంక్షేమ పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా రామసాగరంలో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ప్రజావేదిక నిర్వహించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతామని, సంక్షేమ పథకాలను అందిస్తామని కలెక్టర్‌ అన్నారు. పొలంబడి, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర ...

PAYYAVULA KESHAV : సంక్షేమ పాలనే ప్రభుత్వ లక్ష్యం
Minister Payyavula Keshav speaking in the meeting

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌

బెళుగుప్ప, సెప్టెంబరు 20: వైసీపీ నిరంకుశ పాలనతో గాడితప్పిన వ్యవస్థలను చక్కదిద్ది.. ప్రజా సంక్షేమ పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా రామసాగరంలో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ప్రజావేదిక నిర్వహించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతామని, సంక్షేమ పథకాలను అందిస్తామని కలెక్టర్‌ అన్నారు. పొలంబడి, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర కార్యక్రమాల్లో కలసి పనిచేస్తామని అన్నారు. ఉపాధి పథకం అమలుతో సత్ఫలితాలు సాధిస్తున్నామని అన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించి, అధ్వాన్నంగా పాలన సాగించారని కేశవ్‌ విమర్శించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులెదురైనా కరువు కోరల నుంచి జిల్లాను గట్టెక్కిస్తామని అన్నారు.


హంద్రీనీవా కాలువను ఆధునికీకరించి, 12 పంపుల ద్వారా కృష్ణాజలాలు తీసుకొస్తామని అన్నారు. త్వరలోనే నీటి పారుదలశాఖ మంత్రి ఇక్కడ పర్యటిస్తారని, హం ద్రీనీవా పరిధిని పెంచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అధికారులు మన ప్రభుత్వం అన్న ఆలోచనలతో పనిచేయాలని సూచించారు. అనంతరం రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ చేశారు. బెళుగుప్ప రేషన డీలర్‌-2 అక్రమాలపై కలెక్టరుకు టీడీపీ నాయకులు పెద్ద తిప్పయ్య ఫిర్యాదు చేశారు. సర్పంచ రామలక్ష్మి, ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, తహసీల్దారు షర్మిల తదితరులు పాల్గొన్నారు. అంతకు మునుపు మంత్రి జనంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు ఆలయాలను సందర్శించి, మొక్కలు నాటారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Sep 21 , 2024 | 12:37 AM