CHRISTMAS : ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ABN , Publish Date - Dec 25 , 2024 | 11:56 PM
మానవాళికి దివ్యసందేశాలను వినిపిం చిన యేసుక్రీస్తు భూమిపై అవతరించిన రోజైన క్రిస్మస్ వేడుకలను బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనం గా నిర్వహించారు. జిల్లాలోని చర్చిలన్నీ క్రైస్తవులతో కిటకిటలాడుతూ దేదీప్యమానంగా వెలుగొందాయి. ప్ర త్యేక ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వ హించారు.
అనంతపురం కల్చరల్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : మానవాళికి దివ్యసందేశాలను వినిపిం చిన యేసుక్రీస్తు భూమిపై అవతరించిన రోజైన క్రిస్మస్ వేడుకలను బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనం గా నిర్వహించారు. జిల్లాలోని చర్చిలన్నీ క్రైస్తవులతో కిటకిటలాడుతూ దేదీప్యమానంగా వెలుగొందాయి. ప్ర త్యేక ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వ హించారు. జిల్లా కేంద్రంలోని సప్తగిరి సర్కిల్‌లో ఉన్న ఎస్‌ఐయూ టౌన్ కాంగ్రినేషనల్ చర్చి, అరవిందనగర్‌లోని సీఎస్‌ఐ హోలి ట్రినిటీ చర్చి, జీసస్ కంపాషన్ చర్చి, రామచంద్రనగర్‌లోని కార్మెల్‌మాత చర్చి, అంబేడ్కర్ నగర్‌లోని యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం, కళ్యాణదుర్గం రోడ్డులోని క్రీస్తుసంఘం చర్చి, కోర్టు రోడ్డులోని గాస్పెల్ హాల్ చర్చి, నాయక్‌నగర్‌లోని అగాపే చర్చిలతో పాటు వివిధప్రాంతాల్లోని చర్చిల న్నింటిలోనూ క్రైస్తవులు విశేషంగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎస్‌ఐయూ చర్చిలో పాస్టర్ రెవరెం డ్ సంపత్ విజయ్‌కుమార్ దైవసందేశం ఇచ్చారు. సాయంత్రం మ్యూజికల్ నైట్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జీసస్ కంపాషన్ చర్చి లో మోజస్ అనీల్‌కుమార్, సీఎస్‌ఐ చర్చిలో శంషా బాద్‌లోని మెన్నోనైట్ బ్రేత్రెన సెంచనరీ బైబిల్ కళా శాల ప్రొఫెసర్ రెవరెండ్ శామ్యూల్ రాజశేఖర్, రెవ రెండ్ బెనహర్‌బాబు దైవసందేశాన్నిచ్చారు. అనంతరం కేక్ కట్‌చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇలా జిల్లావ్యాప్తంగా ప్రార్థనామందిరాలన్నింటిలోనూ క్రిస్మస్ వేడుకలను వైభవంగా నిర్వహించారు. అలాగే రాప్తా డు నియోజకవర్గంలోని అన్ని చర్చిలకు ఎమ్మెల్యే పరిటాల సునీత టీడీపీ స్థానిక నాయకుల ద్వారా క్రిస్మస్ కేక్ పంపి, కట్ చేయించారు.
యుగకర్త యేసు : ఎమ్మెల్యే దగ్గుపాటి
సర్వ మానవాళికి శాంతి సందేశమిచ్చిన యుగకర్త యేసుక్రీస్తు అని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్ర సాద్ పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరిం చుకుని ఆయన సప్తగిరి సర్కిల్‌లోని ఎస్‌ఐయూ చర్చి, జీసస్‌నగర్‌లోని హెర్మోన చర్చి, అర విందన గర్‌లోని సీఎస్‌ఐ హోలి ట్రినిటి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చునని యేసుక్రీస్తు నిరూపించారన్నారు. కర్తవ్యం, ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగం అనే గుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి, టీడీపీ క్రిస్టియన సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామి దాస్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే లక్ష్మీనరసింహ, మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఫిరోజ్ అహ్మద్, తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని, ఆర్యవైశ్య సంఘం నాయకుడు తాటి మధు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....