Share News

DEVOTIONAL : ఘనంగా కార్తీక పూజలు

ABN , Publish Date - Nov 26 , 2024 | 12:04 AM

కార్తీక సోమవార పూజలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ మాసంలో చివరి సోమవారం కావడంతో జిల్లాలోని శివాలయాలు, పర మేశ్వరుడి సమేత అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు వేకువజామునే చన్నీటి స్నానమాచరించి, ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద ఎత్తున శివాలయాలకు చేరుకుని దీపాలు వెలిగించి పరమేశ్వరుడికి హారతులు పట్టారు.

DEVOTIONAL : ఘనంగా కార్తీక పూజలు
Women participating in Parthiva Linga Pujas at Pathur Vasavi Temple

అనంతపురం కల్చరల్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : కార్తీక సోమవార పూజలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ మాసంలో చివరి సోమవారం కావడంతో జిల్లాలోని శివాలయాలు, పర మేశ్వరుడి సమేత అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు వేకువజామునే చన్నీటి స్నానమాచరించి, ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద ఎత్తున శివాలయాలకు చేరుకుని దీపాలు వెలిగించి పరమేశ్వరుడికి హారతులు పట్టారు. జిల్లాకేంద్రంలో మొదటిరోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామాల యంలో స్వామివారి దర్శనానికి క్యూకట్టారు. ఈ సంద ర్భంగా స్వామికి ఏకాదశవార రుద్రాభిషేకం, పంచా మృతాభిషేకం, బిల్వార్చన, ప్రత్యేక అలంకరణ చేశారు. రాత్రి స్వామికి శయనోత్సవ సేవ నిర్వహించారు. ఎ మ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ హాజరై ఆకాశ దీపం వెలిగించారు. అనంతరం ఎమ్మెల్యేతోపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి లక్ష ఒత్తుల దీపాన్ని వెలిగించారు.


అదేవిధంగా నగర శివారు బెంగళూరు రోడ్డులోని శివకోటి ఆలయంలో శివకామేశ్వరస్వామికి రుద్రాభిషేం, బిల్వార్చన చేశారు. పాతూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీ మహిళా మం డలి ఆధ్వర్యంలో 108 పార్థివ లింగపూజలు నిర్వ హిం చారు. తిలక్‌రోడ్డు రామాలయం ఆవరణలోని శివాల యంలో స్వామివారికి అన్నాభిషేకం చేశారు. శారదా నగర్‌లోని శృంగేరి శంకరమఠంలో పరమేశ్వ రుడితో పాటు శంకరాచార్యులకు విశేష పూజలు చేశారు. శివ బాలయోగి ఆశ్రమంలో అనంతేశ్వరి, అనంతేశ్వర స్వా మి మూలవిరాట్లను విశేషంగా అలంకరించి పూజాది కైంకర్యాలు నిర్వహించారు. తపోవనంలోని చిన్మయా జగదీశ్వరాలయం, పాతూరులోని వీరబ్రహ్మేంద్ర స్వా మి ఆలయం, ఆరోరోడ్డులోని శివాలయం, జడ్పీ ఎదు రుగా ఉన్న సాయి గీతామందిరం శివాలయం, పాతూ రు విరూపాక్షేశ్వర దేవాలయం, అరవిందనగర్‌లోని సర్వేశ్వరాలయం, హెచ్చెల్సీ కాలనీలోని మంజునాథ స్వామి దేవాలయం, హౌసింగ్‌బోర్డులోని వెంక టేశ్వర స్వామి దేవాలయ ఆవరణలోని శివాలయంలో నూ ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి జ్యోతులు పట్టారు.

Updated Date - Nov 26 , 2024 | 12:04 AM