MAREMMA FESTIVAL : ఘనంగా మారెమ్మ ఉత్సవాలు
ABN , Publish Date - Sep 03 , 2024 | 11:59 PM
గుమ్మఘట్ట మండల సరిహద్దులో కర్ణాటక ప్రాంతంలోని గౌరసముద్రం అడ వి ప్రాంతంలో వెలసిన మారెమ్మ ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహిం చారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాది మంది హాజరై మొక్కులు తీర్చుకుంటారు. ఒక్క రోజు మధ్యాహ్నం జరిగే ఉత్సవాలకు అనాది చరిత్ర ఉంది. సాయంత్రానికి ఈ జాతరలో ఒక్కరూ ఉండరు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్)
గుమ్మఘట్ట మండల సరిహద్దులో కర్ణాటక ప్రాంతంలోని గౌరసముద్రం అడ వి ప్రాంతంలో వెలసిన మారెమ్మ ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహిం చారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాది మంది హాజరై మొక్కులు తీర్చుకుంటారు. ఒక్క రోజు మధ్యాహ్నం జరిగే ఉత్సవాలకు అనాది చరిత్ర ఉంది. సాయంత్రానికి ఈ జాతరలో ఒక్కరూ ఉండరు. తిరిగి తమ గ్రామాలకు చేరు కుంటున్నారు. అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాల్లో గ్రామ దేవత మారె మ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.
అదేవిధంగా గౌర సముద్రం మారె మ్మ ఉత్సవాలను రాయదుర్గం రూరల్, బెళుగుప్ప, కుందుర్పి మండలాల్లో ఘనం గా నిర్వహించారు. ఉదయం నుంచి భక్త మండలి ఆధ్వర్యం లో విశేషపూజా కార్యక్రమాలు జరిపారు. ధ్వజారోహణ, అభిషేకాలు, అష్టోత్తర శతనామార్చన అమ్మవారికి వడిబియ్యం సమర్పణ, ప్రత్యేకాలంకరణ పురవీధుల గుండా అమ్మవారి ప్రభ ఊరేగింపు సామూహిక కుంకుమార్చన, మహామంగళహారతి, తీర్థ ప్రసాదాల వినియోగం, అన్నప్రసాద వితరణతో పూజలు ముగిశాయి. భక్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....