Share News

DAY of the DEAF : ఘనంగా అంతర్జాతీయ బధిరుల దినోత్సవం

ABN , Publish Date - Sep 30 , 2024 | 12:09 AM

అంతర్జాతీయ బధిరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీ బధిరుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ కార్యాలయం ఆవరణంలోని ఆడిటోరియంలో కేక్‌కట్‌ చేసి సైగలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కుమార్‌ మాట్లాడుతూ... ప్రజలు సైగల భాషను ఆకళింపు చేసుకునేలా ప్రభుత్వం తగు సూచనలు చేయాలని కోరారు.

DAY of the DEAF : ఘనంగా అంతర్జాతీయ బధిరుల దినోత్సవం
Members cutting a cake on the International Day of the Deaf

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 29: అంతర్జాతీయ బధిరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీ బధిరుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ కార్యాలయం ఆవరణంలోని ఆడిటోరియంలో కేక్‌కట్‌ చేసి సైగలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కుమార్‌ మాట్లాడుతూ... ప్రజలు సైగల భాషను ఆకళింపు చేసుకునేలా ప్రభుత్వం తగు సూచనలు చేయాలని కోరారు. సమాజంలో అందరితో సమానం గా బధిరులను చూడాలన్నారు. బధిర ఉద్యోగులకు సంబంధించి సర్వీస్‌ రూల్స్‌ను సైగల ద్వారా వివరించాలని కోరారు. కార్యక్రమంలో బధిరుల సంఘం రాష్ట్ర కోశాధికారి ఇమ్రానఖాన, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, శ్రీరాములు, ఉపాధ్యక్షుడు రవి, గౌరవాధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 30 , 2024 | 12:09 AM