SOIL DAY : ఘనంగా ప్రపంచ నేల దినోత్సవం
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:35 AM
మండలంలోని బండ్లపల్లి జడ్పీ పాఠశాలలో గురువారం ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ రేకులకుంట వ్యవసాయ పరిశోఽ దన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త విజయశేఖర్‌బాబు, అనంతపురం భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ రోజాపుష్పలత, తాడిపత్రి డివిజన ఏడీఏ చంగల్‌రాయుడు, బండ్లపల్లి జడ్పీహెచఎస్ హెచఎం శేషగిరి, మండల వ్యవసాయ అధికారి చెన్నవీరస్వామి హాజరయ్యారు.
నార్పల, డిసెంబరు5(ఆంధ్రజ్యోతి): మండలంలోని బండ్లపల్లి జడ్పీ పాఠశాలలో గురువారం ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ రేకులకుంట వ్యవసాయ పరిశోఽ దన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త విజయశేఖర్‌బాబు, అనంతపురం భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ రోజాపుష్పలత, తాడిపత్రి డివిజన ఏడీఏ చంగల్‌రాయుడు, బండ్లపల్లి జడ్పీహెచఎస్ హెచఎం శేషగిరి, మండల వ్యవసాయ అధికారి చెన్నవీరస్వామి హాజరయ్యారు. నేల స్వభావం, వాటి సంరక్షణ గురించి విద్యార్థులకు , రైతలకు వివరించారు. రైతులు భూసార పరీక్షలను తప్పక చేయించుకోవాని తెలిపారు. అనంతరం విద్యార్థులకు భూసార పరీక్ష లపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు, గెలుపొందిన వారికి మెమోంటోలను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాకమిటీ చైర్మన మధుసూదనరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి రాము, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భూసారాన్ని సంరక్షించుకుందాం
రైతులు భూసార పరీక్షలను క్రమం తప్పకుండా చేయిం చుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీ చంగల్‌రాయుడు పేర్కొన్నారు. సూక్ష్మ పోషకాలతో భూసారాన్ని కాపాడుకోవాలన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ గోదాము వద్ద జై కిసాన ఉత్పత్తులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జై కిసాన ఉత్పత్తులు నాణ్యంగా, ధర తక్కువతో లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్పల సహకార సంఘం సీఈఓ భవాని ప్రసాద్, జైకిసాన సంస్థ జిల్లా మార్కెటింగ్ ప్రతినిధి రాజేష్‌ఖన్నా, కిరనకుమార్, హర్షవర్దన, బాబయ్య, రైతులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....