Share News

Anitha: అత్తా కోడళ్ళపై దారుణం.. 48 గంటల్లో నిందితుల అరెస్టు: హోంమంత్రి

ABN , Publish Date - Oct 15 , 2024 | 01:31 PM

పోలీసులకు ఆయుధాల్లాగే ప్రజలకు మొబైల్ ఫోన్‌లు కూడా ఉన్నాయని, వాటిని వినియోగించి నేర నియంత్రణకు సహకరించాలని హోంమంత్రి అనిత కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

Anitha: అత్తా కోడళ్ళపై దారుణం.. 48 గంటల్లో నిందితుల అరెస్టు: హోంమంత్రి

అమరావతి: సత్యసాయి జిల్లా (Sathya Sai District)లో అత్తా కోడళ్ళపై అత్యాచారం (Rape) చేసిన ఘటనలో 48 గంటల్లో నిందితులను పోలీసులు (Police) పట్టుకున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆదేశాల మేరకు ఈ ఘటనలో నిందితులకు వేగంగా శిక్ష పడాలని ఆదేశాలు జారీ చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) అన్నారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ దీనిపై విచారణ కోసం కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందులో ప్రజల. భాగస్వామ్యం కూడా కోరుతున్నామన్నారు. తమ ఇళ్ల వద్ద, వ్యాపార వాణిజ్యం సముదాయాల వద్ద పెట్టుకున్న సీసీ కెమెరాలను పోలీసు శాఖకు అనుసంధానం చేస్తే నేర నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు.


పోలీసులకు ఆయుధాల్లాగే ప్రజలకు మొబైల్ ఫోన్‌లు కూడా ఉన్నాయని, వాటిని వినియోగించి నేర నియంత్రణకు సహకరించాలని హోంమంత్రి అనిత కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే సత్యసాయి జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనలో అత్యంత వేగంగా విచారణ కోసం దొరికిన 5 గురు నిందితుల్లో ఒకరిపై 37 కేసులు ఉన్నాయని, అతనిపై అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నాయని, అందుకే త్వరితగతిన విచారణకు ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తున్నామని తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.


సత్యసాయి జిల్లాలో ఈనెల 12 వతారీఖున (దసరా రోజు) అత్తాకోడళ్లు సామూహిక అత్యాచారానికి గురయ్యారని.. సంఘటన జరిగిన 48 గంటల్లోనే పోలీసులు నిందితులను పట్టుకొని రిమాండు విధించారని హోంమంత్రి అనిత తెలిపారు. మహిళల భద్రత విషంయంలో ఈ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, ఆడపిల్లపై నేరం చేయాలనే ఆలోచన వస్తేనే భయం వేసే పరిస్ధితి తేవాలని సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించారన్నారు. సీసీ కెమెరాలు బద్దలు కొట్టినా వారిని రెండు వందల కిలోమీటర్లు చేజ్ చేసి కొండలు గుట్టల్లో కూడా వెతికి 48 గంటల్లో పట్టుకున్నారని చెప్పారు. వారంతా నేరచరిత్ర కలిగిన వ్యక్తులని.. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని.. వారిలో ఉన్నవారిపైనా చాలా కేసులు ఉన్నాయన్నారు.


తప్పనిసరిగా శిక్షపడుతుందనే ఆలోచన వస్తేనే ఇలాంటి కేసులు తగ్గుతాయని హోంమంత్రి అనిత అభిప్రాయపడ్డారు. ఇలాంటి కేసులు వస్తే వాటిని స్పెషల్ కోర్టులకు పంపుతామన్నారు. గత ప్రభుత్వంలో ఒక రిక్రూట్‌మెంట్ ఒక్కటి కూడా జరగలేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ చేస్తున్నామన్నారు. దసరా సమయంలో, ఆ తరువాత భనానీల రాక విషయంలోనూ పోలీసులు గొప్పగా పనిచేశారని హోంమంత్రి అనిత కొనియాడారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అదే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రస్తానం

ఏబీఎన్‌కు డిప్యూటీ సీఎం భట్టి శుభాకాంక్షలు

జగన్ కుట్రలను ఎదుర్కొని నిలబడ్డా ఏబీఎన్..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ప్రముఖుల శుభాకాంక్షలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 15 , 2024 | 01:31 PM