BRIDGE : అదుపు తప్పితే... అంతే సంగతులు..!
ABN , Publish Date - Dec 10 , 2024 | 12:14 AM
నిత్యం వం దలాది వాహనాలు రాకపోకలు సాగించే మండలం లోని పలు రహదారులు ప్రయాణికుల పట్ల ప్రమాద కరంగా మారాయి. సైడ్‌వాల్‌లు లేని బ్రిడ్జిల వద్ద వాహనచోదకులు ఏ మాత్రం ఆదమరిచినా అంతే సంగతులు. ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి బ్రిడ్జిల వద్ద ప్రమాదకరంగా ఉందని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇటు అధికారులు...అటు పాలకులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ప్రమాదకరంగా యర్రగుంట్ల బ్రిడ్జి
సైడ్ వాల్‌లు లేని వైనం
భయంభయంగా వెళ్తున్న ప్రయాణికులు
గార్లదిన్నె, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : నిత్యం వం దలాది వాహనాలు రాకపోకలు సాగించే మండలం లోని పలు రహదారులు ప్రయాణికుల పట్ల ప్రమాద కరంగా మారాయి. సైడ్‌వాల్‌లు లేని బ్రిడ్జిల వద్ద వాహనచోదకులు ఏ మాత్రం ఆదమరిచినా అంతే సంగతులు. ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి బ్రిడ్జిల వద్ద ప్రమాదకరంగా ఉందని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇటు అధికారులు...అటు పాలకులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గార్లదిన్నె మండల పరిధిలోని యర్రగుంట్ల గ్రామ సమీపంలో ఉన్న బ్రిడ్జి ఇలా ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జికి సైడ్‌వాల్‌లు కొన్నేళ్ల క్రితమే కూలిపోయాయి. వాటిని తిరిగి నిర్మించడంలో ఆర్‌అండ్‌బీ అధికారులు గానీ, పాలకులు గానీ పట్టించుకోలేదు. పెనకచెర్ల డ్యాం, పెనకచెర్ల, కొత్తపల్లి, కొప్పలకొండ, కమలాపురం, కొట్టాలపల్లి తదితర గ్రామాల నుంచి ఆటోలు, బస్సులు, ద్విచక్ర వాహనాల్లో నిత్యం వందలాది మంది వివిధ ప నుల నిమిత్తం గార్లదిన్నె, అనంతపురానికి ఆ బ్రిడ్జి పైనే ప్రయాణం సాగిస్తారు. ఎప్పు డు ఏ ప్రమాదం జరుగు తుందోనని ప్రాణాలు అరచేతి లో పెట్టుకుని ప్రయాణిస్తు న్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జికి సైడ్ వాల్వు నిర్మించాలని పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా ఎవరూ స్పం దించలేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు...అధికారులు స్పందించి బ్రిడ్జికి సైడ్ వాల్‌లు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....