Share News

TREES : ప్రమాదం అయితే మాకేంటి..?

ABN , Publish Date - Nov 27 , 2024 | 12:19 AM

జిల్లా కేంద్రంలో వింత వైఖరి నెలకొం ది. పాత భవనల వద్ద ప్రమాదకరంగా ఉన్న చెట్లను గానీ, నూతన భవన నిర్మాణాలకు అడ్డుగా ఉన్న చెట్లను గానీ తొలగించాలంటే నిబంధనల ప్రకారం అటవీశాఖ అధికారుల నుంచి ముందుగా అనుమతి పొందాలి. అనుమతి లేకుండా తొలగిస్తే తగిన రీతిలో అపరాధ రుసుం చెల్లించాలి. అయితే దీనితో పాటు అటవీవాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి చేతులు తడపాల్సిందేనన్న విమర్శలు వినిపిస్తున్నా యి.

TREES : ప్రమాదం అయితే మాకేంటి..?

పలు ఇళ్ల వద్ద ప్రమాదకరంగా చెట్లు

అనుమతికి అటవీ అధికారుల జాప్యం

ఇబ్బందులు పడుతున్న యజమానులు

అనంతపురం న్యూటౌన, నవంబరు26, (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో వింత వైఖరి నెలకొం ది. పాత భవనల వద్ద ప్రమాదకరంగా ఉన్న చెట్లను గానీ, నూతన భవన నిర్మాణాలకు అడ్డుగా ఉన్న చెట్లను గానీ తొలగించాలంటే నిబంధనల ప్రకారం అటవీశాఖ అధికారుల నుంచి ముందుగా అనుమతి పొందాలి. అనుమతి లేకుండా తొలగిస్తే తగిన రీతిలో అపరాధ రుసుం చెల్లించాలి. అయితే దీనితో పాటు అటవీవాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి చేతులు తడపాల్సిందేనన్న విమర్శలు వినిపిస్తున్నా యి. అనుమతి లేకుండా చెట్లు తొలగిస్తూ పట్టుపడిన వారు, దాని నుంచి బయట పడటానికి అటవీశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందేనన్న ప్రచారం జరుగుతోంది. అక్కడ సిబ్బందికి బేరం కుద రకపోతే ముప్పతిప్పలు పెడతారన్న ప్రచారం జరుగు తోంది. ఇలాంటి బాదితు కార్యాలయం చుట్టు తిరగ డం వారి వంతుగా మారింది. ముఖ్యంగా అనుమతి పొందాలంటే ఆనలైన ద్వారా అటవీశాఖ ఖాతాకు తగిన రుసుము చెల్లించి, ఆ రసీదుతో దరఖాస్తును కార్యాలయంలోని సిబ్బందికి అందజేయాలి. దరఖాస్తు ను పరిశీలించిన అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు సిబ్బందికి ఆదేశాలు జారీ చే స్తారు. అనంతరం ఏ రెండు రోజులకో సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రమాద తీవ్రను బట్టి ఉన్నతాధి కారుల ఆమోదానికి నివేదిక పంపుతారు. ఇంతటితో క్షేత్రస్థాయి సిబ్బంది పని అయిపోతుంది. అయితే అనుమతి ఇవ్వడానికి దరఖాస్తుదారుడికి చుక్కలు చూపుతున్నారన్న విమర్శ లు వినిపిస్తున్నాయి.


అయితే అక్కడ ప్రమాద పరిధిని బట్టి అంతవరకు కొమ్ములు కొట్టుకొనే వెసులుబాటు కల్పిస్తారు. అయితే కొందరు చెట్లను పూర్తిగా తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని పట్టుబట్టేవారు ఉన్నారు. ఇక్కడ ముడుపుల బేరానికి తెరలేస్తుంది. బేరం కుదిరితే ఓకే.... లేదంటే కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేయాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉంటే మున్సిపాలిటీ స్థ లంలో ఉన్న చెట్టు భవనం మీద పడి పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అటవీ అధికారులు మున్సిపల్‌ అధికారుల నుంచి అంగీకారపత్రం తెచ్చే వరకు అనుమతి ఇవ్వ రు. ఇక మున్సిపల్‌ కార్యాల యంలో చెట్టు కొట్టడానికి మేమేందుకు అనుమతి ఇస్తామని అంటున్నారు. దీని గురించి అక్కడ పట్టిం చుకునేవారు లేరు. దీంతో ఈ రెండు కార్యాలయాల చుట్టూ బాధితులు తిరిగి తిరిగి వాళ్ల కాళ్లు అరగాల్సిందే తప్ప అనుమతి కష్టమన్న ప్రచారం జరుగుతోంది. జిల్లా కేంద్రం పరిధిలోని ఇం టి ఆవరణ, సమీపప్రాంతాల్లో మొక్క లు నాటేది ఎం దుకు... ఏదైన సమస్య వచ్చినప్పుడు అధికారుల చు ట్టూ తిరగడం ఎందుకు? అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాద తీవ్రతను బట్టి వీలైనంత త్వరగా అనుమతులు ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు.

ఎక్కువ శాతం క్షేత్రస్థాయికి వెళ్లాల్సి వస్తోంది- శ్రీనివాసులు, ఎఫ్‌ఆర్‌ఓ

దరఖాస్తులు స్వీకరించిన అనం తరం సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలి. అక్కడ ఇంటిపై చెట్టు ప్రభావం ఎంత అన్నది నివేదిక తయారు చేయాలి. అందుకు అనుగుణంగానే అను మతి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో సిబ్బంది ఎక్కువ శాతం క్షేత్ర స్థాయికి వె ళ్లాల్సి వస్తోంది. దీంతో అనుమతుల మంజూరులో కొంత ఆలస్యం అవుతోంది. ఇకపై ఆలస్యం కాకుండా వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేస్తాం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 27 , 2024 | 12:19 AM