Share News

Pension : పింఛన పెంపు అమలు

ABN , Publish Date - Jun 14 , 2024 | 11:29 PM

పింఛన పెంపు అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్‌ నెల నుంచే అమలు చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబునాయుడు... ఆ మేరకు ఆ హామీ అమలుపై దృష్టి సారించారు. ఏప్రిల్‌, మే, జూన నెలల బకాయిలతో పాటు జూలై నెలతో కలుపుకుని చెల్లించేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు పింఛన పెంచుతూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ జీఎం నంబరు 43 జారీ చేశారు. జూన నెలలో పంపిణీ చేసిన రూ.86.80 కోట్లతో ..

Pension : పింఛన పెంపు అమలు
Pension Money

బకాయిలతో కలిపి నిధుల కేటాయింపు

జిల్లాకు అదనంగా రూ.110 కోట్లు

మొత్తం రూ.197 కోట్ల పంపిణీకి సిద్ధం

ఉత్తర్వులు జారీ చేసిన నూతన ప్రభుత్వం

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 14: పింఛన పెంపు అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్‌ నెల నుంచే అమలు చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబునాయుడు... ఆ మేరకు ఆ హామీ అమలుపై దృష్టి సారించారు. ఏప్రిల్‌, మే, జూన నెలల బకాయిలతో పాటు జూలై నెలతో కలుపుకుని చెల్లించేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు పింఛన పెంచుతూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ జీఎం నంబరు 43 జారీ చేశారు. జూన నెలలో పంపిణీ చేసిన రూ.86.80 కోట్లతో పాటు బకాయిలను చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూలైకి సంబంధించి మొత్తం పింఛనదారులు 2,89,995 మందికి గాను పెంచిన సొమ్ముతో కలిపి రూ.127 కోట్లు, బకాయిలు రూ.70.73 కోట్లు మొత్తం రూ.197 కోట్లు జిల్లాకు


కేటాయించారు. గతంలో రూ.3000 పింఛనను ఏప్రిల్‌ నుంచి రూ.4,000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. వృద్ధులు 1,44,715 మందికి రూ.101 కోట్లు, వితంతువులు 66,769 మందికి రూ.46.7 కోట్లు, చేనేతలు 6,769 మందికి రూ.5 కోట్లు, కల్లుగీత కార్మికులు 354 మందికి రూ.24 లక్షలు, మత్స్యకారులు 892 మందికి రూ.61 లక్షలు, ఒంటరి మహిళలు 6,737మందికి రూ.4.70 కోట్లు, సఫాయి కర్మాచారులు 3,528 మందికి రూ.2.41 కోట్లు, హిజ్రాలు 207 మందికి రూ.1.45 లక్షలు, హెచఐవీ బాధితులు 2,475 మందికి రూ.రూ.1.70 కోట్లు, డప్పు కళాకారులు 3,141 మందికి రూ.2.20 కోట్లు, కళాకారులు 185 మందికి రూ.1.30 లక్షలు, దివ్యాంగులు 46,439 మందికి రూ.27.86 కోట్లు, కుష్టువ్యాధి బాధితులు 392 మందికి రూ.23 లక్షలు, మంచానికే పరిమితమైన బాధితులు 1,451 మందికి రూ.2,17 కోట్లు, ప్రమాద బాధితులు 1091 మందికి రూ.1.63 కోట్లు ఇతరత్రా బాధితులకు కలిపి మొత్తం 2,89,995 మందికి రూ.197 కోట్లు జూలైలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కొత్త పింఛన ఎప్పుడు ఇస్తారనేది ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇంటివద్దకే పింఛన పంపిణీ చేస్తారా... ఏప్రిల్‌, మే, జూన తరహాలోనే చేపడుతారా... అనేది ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. పింఛన పెంపుపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jun 14 , 2024 | 11:29 PM