THINGS : అదృశ్యమైన వస్తువులు ప్రత్యక్షం
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:18 AM
ఇటీవల డ్వామా పీడీ కార్యా లయంలో, పీడీ బంగ్లానుంచి అదృశ్యమైన వస్తువుల్లో కొన్ని వచ్చి చేరాయి. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో రెండు ఏసీలు, టీవీ, ఫర్నీచర్‌ను డ్వామా పీడీ బంగ్లాలోకి ఎవరో తెచ్చి పె ట్టారని ఆశాఖ వారే అంటున్నారు. అయితే మొత్తం డ్వామా పీడీ కార్యాల యం, బంగ్లాలో నుంచి ఇటీవల ఎనిమిది ఏసీలు, రూ.10లక్షలకు పైగా విలువ చేసే ఫర్నీచర్‌ను ఎవరో ఎత్తుకెళ్లారు.
అనంతపురం క్లాక్‌టవర్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ఇటీవల డ్వామా పీడీ కార్యా లయంలో, పీడీ బంగ్లానుంచి అదృశ్యమైన వస్తువుల్లో కొన్ని వచ్చి చేరాయి. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో రెండు ఏసీలు, టీవీ, ఫర్నీచర్‌ను డ్వామా పీడీ బంగ్లాలోకి ఎవరో తెచ్చి పె ట్టారని ఆశాఖ వారే అంటున్నారు. అయితే మొత్తం డ్వామా పీడీ కార్యాల యం, బంగ్లాలో నుంచి ఇటీవల ఎనిమిది ఏసీలు, రూ.10లక్షలకు పైగా విలువ చేసే ఫర్నీచర్‌ను ఎవరో ఎత్తుకెళ్లారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో ‘ మరీ ఇంత కక్కుర్తా... డ్వామాలో దొంగలుపడ్డారు’ అనే కథనం ప్రచురితమైంది. దీంతో విషయం బయటకు పొక్కడం వల్ల వాటిలో కొన్నిటిని తిరిగి చేర్చారు. ఈ తతంగంలో కీలకంగా ఓ ఉద్యోగి ఉన్న ట్లు ఆ శాఖలో అందరూ చర్చిం చుకుంటున్నారు. కొత్తగా వచ్చిన పీడీకి తెలియ కుండానే కీలక ఉద్యోగి ఇవన్నీ చేశారని చెబుతున్నారు. అయితే అతడికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తు న్నారనేది తోటి ఉద్యోగుల్లో సందేహం. డ్వామా పీడీ బంగ్లాలోని ఏసీలు, ఫర్నీచర్ తెచ్చిపెట్టారు కానీ... పీడీ కార్యాలయం, కాన్ఫరెన్సహాల్‌లో నుంచి తీసుకెళ్లిన ఏసీలు, ఇతర ఫర్నీచర్ ఎవరి వద్ద ఉన్నాయో తేలాల్సిఉంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....