Share News

FARMERS : సాగునీటి సంఘం... ఓటరు జాబితాపై గందరగోళం

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:29 AM

త్వరలో జరగబోమే సాగునీటి సంఘం ఎన్నికల ఓటర్ల జాబితాపై మండలంలో గందరగోళం నెలకొంది. పాత జాబితానే అధికారులు ఉంచారని రైతులు ఆరోపిస్తు న్నారు. అయితే ఓటు నమోదుకు సమయం ఇచ్చి నా రైతులెవరూ రాలేదని అధికారులు అంటున్నా రు. దీంతో సాగు నీటి సంఘం ఓటర్ల జాబితాపై గందర గోళం పరిస్థితి ఏర్పడింది.

FARMERS : సాగునీటి సంఘం... ఓటరు జాబితాపై గందరగోళం

శింగనమల, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): త్వరలో జరగబోమే సాగునీటి సంఘం ఎన్నికల ఓటర్ల జాబితాపై మండలంలో గందరగోళం నెలకొంది. పాత జాబితానే అధికారులు ఉంచారని రైతులు ఆరోపిస్తు న్నారు. అయితే ఓటు నమోదుకు సమయం ఇచ్చి నా రైతులెవరూ రాలేదని అధికారులు అంటున్నా రు. దీంతో సాగు నీటి సంఘం ఓటర్ల జాబితాపై గందర గోళం పరిస్థితి ఏర్పడింది. మండలంలో ఇరిగేషన శాఖ పరిధిలో ఉన్న శింగనమల చెరువు, సలకంచెరు వు సాగునీటి సంఘాల అధ్యక్షు లు, డైరెక్టర్ల ఎన్ని కలు జరగబో తున్నాయి. ఇప్పటికే ఇరిగేషన, రెవెన్యూ శాఖల అధికారులు సంబంధిత ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. దాని ప్రకారం శింగనమల చెరువు ఆయ కట్టు కింద 2472 మంది రైతులు, సలకం చెరువ ఆయకట్టు కింద 447 మంది రైతులు ఓటర్లుగా ఉన్నారు. అయితే ఓటర్ల జాబి తాలో తమ పేర్లు లేవని ఇంకా చాలా మంది ఆయ కట్టు రైతులు అధికా రులను నిఽలదీస్తున్నారు. అధికా రులు కేవలం 2015 సంవత్సరం ఓటర్ల జాబితానే ఇచ్చారని నూతనంగా ఎవరినీ చేర్చలేదని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రదర్శిం చిన పాత జాబితాలో ఎక్కవగా చనిపోయిన వారి పేర్లు, గ్రామంలో లేని పేర్లు ఉన్నా యంటూ అధికా రులతో వాగ్వాదానికి దిగుతున్నారు.


ఐదు రోజులు గడువిచ్చాం : అధికారులు

సాగునీటి సంఘం ఎన్నికల సందర్భంగా శింగనమ ల, సలకం చెరువుల ఆయకట్టు రైతుల ఓటర్ల జాబి తాలను గత నెల 30న ఆయా సచివాల యాలు, తహసీల్దార్‌ కార్యాలయం నోటీస్‌ బోర్డులలో ఉంచామ ని ఇరిగేషన అధికారులు చెబుతున్నారు. ఆయా రైతు లకు సంబంధించి పొలం సర్వే నంబర్లు విస్తీర్ణంతో జాబితా ప్రదర్శించామంటున్నారు. రైతుల పేర్లలో తప్పులు సరిచేసుకునేందుకు, చనిపోయిన వారి పేర ్లను తొలగిం చేందుకు, కొత్తగా నమోదు చేసుకునేందు కు అక్టోబరు 30 నుంచి నవం బరు 3 వరకు ఐదు రోజలు సమయం ఇచ్చామని తెలిపారు. అయితే రైతులు ఎవరూ దరఖాస్తు చేసు కోలేదని, సమయం దాటిపోయిన తరువాత చాలా మంది రైతులు తమ పేర్లు లేవంటున్నారని అదికారులు చెబుతున్నారు.

నమోదుకు సమయమివ్వాలి - చిన్నప్ప యాదవ్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు

సాగునీటి సంఘం ఎన్నికలకు ఓటర్ల నమోదుకు సమయం పొ డిగించాలి. ఓటర్ల నమోదుపై అధికారులు అవగాహన కల్పిం చకపోవడంతో కొత్తగా ఎవరూ నమోదు చేసుకోలేక పోయారు. అధికారులు స్పందించి ఓటర్ల నమోదుకు సమయం పొడిగించాలి.

గడువు ఇచ్చాం - సాయినాథ్‌, ఇరిగేషన శాఖ జేఈ

సాగునీటి సంఘం ఎన్నికల ఓటర్ల జాబితాను స్థానిక సచివాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రదర్శించాం. రెవెన్యూ శాఖ అధికారుల సాయంతో పేర్లలో తప్పులు సరిచేసుకునేందుకు, చనిపోయిన రైతుల పేర్లు తొలగించేందుకు, నూతనంగా ఓటు నమోదుకు ఐదు రోజులు సమయం ఇచ్చాం. ఇప్పుడు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం లేదు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 14 , 2024 | 12:29 AM