Share News

MjPS ; ఎంజేపీఎస్‌కు ఐఎస్‌ఓ గుర్తింపు

ABN , Publish Date - Oct 15 , 2024 | 12:19 AM

మండల కేంద్రంలోని మహా త్మాజ్యోతి రావు ఫూలే గురు కుల బాలికల పాఠశాల కు ఐఎస్‌ఓ(ఇంటర్నేషనల్‌ స్టాం డర్డ్‌ ఆర్గనైజేషన )సర్టిఫికెట్‌ వచ్చినట్లు గురుకుల పాఠశా లల కన్వీనర్‌ సంగీత కుమారి తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ చేతుల మీదుగా సర్టిఫికెట్‌ను అందుకున్నారు.

MjPS ; ఎంజేపీఎస్‌కు ఐఎస్‌ఓ గుర్తింపు
Receiving the certificate The convenor of the schools is Sangeet Kumari

నార్పల, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని మహా త్మాజ్యోతి రావు ఫూలే గురు కుల బాలికల పాఠశాల కు ఐఎస్‌ఓ(ఇంటర్నేషనల్‌ స్టాం డర్డ్‌ ఆర్గనైజేషన )సర్టిఫికెట్‌ వచ్చినట్లు గురుకుల పాఠశా లల కన్వీనర్‌ సంగీత కుమారి తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ చేతుల మీదుగా సర్టిఫికెట్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా కన్వీనర్‌ సంగీతకుమారి మా ట్లాడుతూ... దేశంలో మొదటిసారిగా ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ అందుకున్న ప్రభుత్వ గురుకుల పాఠశాల అని తెలిపారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కార్పొరేట్‌ పాఠశాల లకు దీటుగా విద్యాబోధన, పాఠశాల నిర్వహణ అందిస్తున్న పాఠశాలగా గుర్తింపు రావడానికి పాఠఽశాలలోని ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతి ఒక్కరి కృషితోనే సాధ్యమైందని ఆమె తెలిపారు. పాఠశాల సి బ్బందికి ప్రిన్సిపాల్‌ సంగీతకుమారి పలువురు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 15 , 2024 | 12:19 AM