Share News

JNTU VC : ప్రతిభను ప్రోత్సహించడమే ఐఎస్‌టీఈ లక్ష్యం

ABN , Publish Date - Sep 19 , 2024 | 12:16 AM

సాంకేతిక విద్యా ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల ప్రతిభను గుర్తించి వారిని ప్రో త్సహించడమే ఇండియన సొసైటీ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన(ఐఎస్‌టీఈ) లక్ష్యమని జేఎనటీయూ ఇనచార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ సుదర్శన రావు పేర్కొ న్నారు. జేఎనటీయూలో బుధవారం ఐఎస్‌టీఈ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ రంగజనార్దన అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి వీసీ సుదర్శనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

JNTU VC : ప్రతిభను ప్రోత్సహించడమే ఐఎస్‌టీఈ లక్ష్యం
ISTE executive committee members honoring VC Sudarshan Rao

జేఎనటీయూ వీసీ ప్రొఫెసర్‌ సుదర్శన రావు

అనంతపురం సెంట్రల్‌, సెప్టెంబరు 18 : సాంకేతిక విద్యా ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల ప్రతిభను గుర్తించి వారిని ప్రో త్సహించడమే ఇండియన సొసైటీ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన(ఐఎస్‌టీఈ) లక్ష్యమని జేఎనటీయూ ఇనచార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ సుదర్శన రావు పేర్కొ న్నారు. జేఎనటీయూలో బుధవారం ఐఎస్‌టీఈ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ రంగజనార్దన అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి వీసీ సుదర్శనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశం లోని అన్నిరాష్ర్టాల్లో ఐఎస్‌టీఈ కమిటీలను ఏర్పాటుచేసి అందులో విద్యా ర్థులను, అధ్యాపకులను సభ్యులుగా భాగస్వామ్యం చేస్తారన్నారు. గత సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కళాశాలలు, అధ్యాపకులు, విద్యార్థులను ఎంపికజేశారని తెలిపారు. వారందరికీ అక్టోబరు 25న కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో అవార్డులను ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. అనంతరం ఐఎస్‌టీఈ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వర్‌రెడ్డి, రవీంద్రబాబు, బాలాజి, శివప్రసాద్‌రెడ్డి, విజయభాస్కర్‌, రాజు, భానుమూర్తి వీసీ సుదర్శనరావును ఘనంగా సత్కరించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 19 , 2024 | 12:16 AM