OFFICE : పడిగాపులతోనే సరి ..!
ABN , Publish Date - Nov 03 , 2024 | 12:34 AM
ఎన్ని రోజులు తిరిగినా స్థానిక స్థానిక తహసీల్దార్ కార్యాల యంలో జనన మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇక్కడి అధికారులు ఎప్పుడు వస్తారో..? ఎప్పుడు వెళతారో..? అర్థం కావడం లేదని మండి పడుతున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ఒక సీనియర్ అసిస్టెంట్ మాత్రం వచ్చారు.
జనన, మరణ ధ్రువీకరణ కోసం వారాల కొద్దీ నిరీక్షణ
పట్టించుకునే వారు లేరని ప్రజల ఆవేదన
శింగనమల, నవంబరు 2(ఆంధ్రజ్యోతి) : ఎన్ని రోజులు తిరిగినా స్థానిక స్థానిక తహసీల్దార్ కార్యాల యంలో జనన మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇక్కడి అధికారులు ఎప్పుడు వస్తారో..? ఎప్పుడు వెళతారో..? అర్థం కావడం లేదని మండి పడుతున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ఒక సీనియర్ అసిస్టెంట్ మాత్రం వచ్చారు. అయితే జనన మరణ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించే అధికారి రాలేదు. ఆయన కోసం పలువురు ఉదయం నుంచి వేచి చూడాల్సి వచ్చింది. వారిలో చా లామంది దరఖాస్తు చేసుకుని రెండు వారాల నుంచి ఎదురు చూస్తున్నట్లు వాపోయారు. కార్యాల యంలో కనీసం దరఖాస్తులను చూసే నాథేడే లేరని ఆవేదన వ్యక్త చేస్తున్నారు. పరిశీలనకు నోచుకోని జనన మరణ ధ్రువ పత్రాల కోసం వచ్చిన దరఖాస్తులు అధిక సం ఖ్యలోనే కార్యాలయంలో ఉన్నట్లు తెలుస్తోంది. రిజిస్టర్ చేయడానికి ఎన్ని సార్లు అడిగినా సంబంధిత అధికారి దరఖాస్తులను రికార్డు రూం నుంచి తీయడం లేదని దరఖాస్తుదారులు ఆరోపిస్తు న్నారు. విద్యార్థులు ఆధార్ కార్డులో తప్పులు సరిచేసుకోవాలంటే జనన ధ్రువీకణ పత్రం తీసుకుని రావాలని అంటున్నారు. అయితే దర ఖాస్తు చేసి వారాలు గడుస్తున్నా ఇక్కడ ఇవ్వడంలే దని విద్యార్థులు, తల్లిదండ్రులు అంటున్నారు. విద్యార్థులకు ఆధార్‌కార్డు మార్పు కోసం సమయం అయిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు వారాల నుంచి తిరుగుతున్నా - ఇమామ్ హుసేన, ఆకులేడు
నా కుమారుడు రజాక్ జనన ధ్రువీ కరణ పత్రం కోసం రెండు వారాల కిం ద తహసీల్దార్ కార్యాలయంలో దర ఖాస్తు చేశాను. అ రోజు నుంచి సార్, మేడం రాలేదని కాలం గడుపుతు న్నా రు. నాలుగురోజుల నుంచి కార్యాల యం చుట్టూ తిరుగుతున్నా పని జరగలేదు.
ఇంకా ఎన్ని తిప్పలు పడాలో - చంద్రకళ, సి.బండమీదపల్లి
నా కుమారుడు, కుమార్తె పేర్లలో అక్షరాలు తప్పులు ఉన్నాయి. అవి సరిచేసుకునేందుకు జనన ధ్రువీకరణ పత్రాల కోసం నాలుగు రోజుల కింద దరఖాస్తు చేశాను. అయితే అధికారులు మీ రిజిస్టర్ రికార్ఢు రూంలో ఉందని దాని బయటికి తీయాలంటూ కాలం గడుపుతున్నారు. శనివారం కార్యాలయం వద్దకు వచ్చినా ఒక్క అధికారి కూడా లేరు. ఇంకా ఎన్నిరోజులు తిరగాలో... ఈ పత్రాలు కోసం ఎన్ని తిప్పలు పడాలో తెలియడం లేదు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....