ANM : మమ్ములను వైద్యశాఖలో కలపండి
ABN , Publish Date - Oct 01 , 2024 | 12:24 AM
తమకు తక్కువ వేతనాలు ఇస్తూ, ఎక్కువగా పనిచేయించుకుంటున్నారని, అంతేగాకుండా తమకు ఎలాంటి గౌరవం లేదని గ్రామ/వార్డు సచివాలయాల ఏఎనఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. తమను వైద్యశాఖలో కలపాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయ ఏఎనఎంలు స్థానిక కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా చేరుకుని ఆందోళన సాగించారు.
కలెక్టరేట్ ఎదుట సచివాలయ ఏఎనఎంల ఆందోళన
అనంతపురం టౌన, సెప్టెంబరు30 : తమకు తక్కువ వేతనాలు ఇస్తూ, ఎక్కువగా పనిచేయించుకుంటున్నారని, అంతేగాకుండా తమకు ఎలాంటి గౌరవం లేదని గ్రామ/వార్డు సచివాలయాల ఏఎనఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. తమను వైద్యశాఖలో కలపాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయ ఏఎనఎంలు స్థానిక కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా చేరుకుని ఆందోళన సాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తాము సచివాలయం, వైద్యం రెండు శాఖల పరిధి లో పనిచేస్తున్నామన్నారు. సచివాలయాల్లోని ఇతర విభాగాల సిబ్బందిని ఆయాశాఖలలో విలీనంచేస్తున్నారని, కానీ ఏఎనఎంలను అలా కలపకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రెండుశాఖల మధ్య తీవ్ర పనిఒత్తిడితో ఇబ్బందులు పడుతూ అనారోగ్యాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వైద్యశాఖలోకి విలీ నంచేయాలన్నారు. అలాగే గ్రేడ్-2 ప్రమోషన్లు కల్పించాలని, స్టాఫ్ నర్శు ఉ ద్యోగాల్లోను ప్రాధాన్యం కల్పించాలన్నారు. లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రాజేష్ గౌడు, కృష్ణుడు, ఏఎనఎంల సంఘం నాయకురాళ్లు రజని, విజయభారతి, బాను, పద్మావతి, జయలక్ష్మి, మంజుల, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....