Share News

DEVOTIONAL : కార్తీక అమావాస్య పూజలు

ABN , Publish Date - Dec 02 , 2024 | 12:17 AM

కార్తీకమాస అమావాస్యను పుర స్కరించుకుని మండల పరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం లో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు రాముస్వామి ఆలయంలో మూలవిరాట్‌కు వివిధ అభిషేకాలు చేసి, అలంకరించారు.

DEVOTIONAL : కార్తీక అమావాస్య పూజలు
Pampanur Subrahmanyeswara Swamy

ఆత్మకూరు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): కార్తీకమాస అమావాస్యను పుర స్కరించుకుని మండల పరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం లో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు రాముస్వామి ఆలయంలో మూలవిరాట్‌కు వివిధ అభిషేకాలు చేసి, అలంకరించారు. భక్తులు అదికసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అన్నదాన కమిటీ సభ్యులు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బాబు,సిబ్బంది తదితరుల పాల్గొన్నారు.

అనంతపురం కల్చరల్‌: స్థానిక నవయుగ కాలనీలోని పెద్దమ్మ దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూ లవిరాట్‌ను వేపమండలు, నిమ్మకాయల హారాలతో విశేషంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకుడు రాజు, కాలనీవాసులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 02 , 2024 | 12:17 AM