TDP : సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:12 AM
బడ్జెట్‌లో ఎస్సీల సంక్షేమం కోసం భారీగా నిధులు కేటా యించినందుకు తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి బంగి నాగ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్థానిక హమాలీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల వద్ద సోమవారం సీఎం చిత్రపటానికి క్షీరాభిషే కం చేశారు.
అనంతపురం అర్బన, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : బడ్జెట్‌లో ఎస్సీల సంక్షేమం కోసం భారీగా నిధులు కేటా యించినందుకు తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి బంగి నాగ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్థానిక హమాలీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల వద్ద సోమవారం సీఎం చిత్రపటానికి క్షీరాభిషే కం చేశారు. దళిత సంఘాల నాయకులు పృథ్వి, అనిల్ కుమార్, శరత, రాజేష్, విద్యాసాగర్, మురళీ, సాయి శంకర్, సాయి వర్థన, పవన, భరతకుమార్ పాల్గొన్నారు. అలాగే బడ్జెట్‌లో మైనార్టీలకు నిధులు కేటాయించినందుకు సోమవారం సాయంత్రం టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సైఫుద్దీన ఆధ్వర్యంలో స్థానిక సప్తగిరి సర్కిల్ మసీదు వద్ద సీఎం చంద్రబాబు చిత్రప టానికి క్షీరాభిషేకం చేశారు. ముస్లిం, మైనార్టీల సంక్షే మం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు.
స్వర్ణాంధ్రకు బాటలు వేసేలా బడ్జెట్
అనంతపురం అర్బన, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర బడ్జెట్ స్వర్ణాంధ్రకు బాటలు వేసే విధంగా ఉం దని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు పద్మ శాలి కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్ పోతుల లక్ష్మీనరసిం హులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు తలారి ఆదినారా యణ, బుగ్గయ్య చౌదరి, టీఎనటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచెపు వెంకటేష్, టీడీపీ బీసీ సెల్ నాయకు లు సిమెంట్ పోలన్న, నాయకులు కురబ నారాయణ స్వామి, నెట్టెం బాలకృష్ణ, కూచి హరి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రయో జనం చేకూర్చేలా బడ్జెట్ ఉందని కొనియాడారు. సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్‌లు నిధులు కేటాయించడం శుభపరిణామం అన్నారు. ఈ బడ్జెట్‌లో ఏపీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....