TDP : కూటమి జయకేతనం
ABN , Publish Date - Dec 15 , 2024 | 01:14 AM
మం డలంలో చెదరుమదురు సంఘటనలు మినహా సాగు నీటి సంఘం, మైనర్‌ఇరిగేషన, హెచ్చెల్సీ డిస్ర్టిబ్యూటరీ సంఘాల చైర్మన్ల ఎన్నికలు ప్ర శాంతంగా జరిగాయి. అన్నింటికి టీడీపీ మద్దతు దారులను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. హెచ్చె ల్సీ ఆయకట్లు కింద ఉన్న పొడరాళ్ల సంఘం చైర్మనగా పామురాయి రామ్మెహన, జంతు లూ రుకు సూర్యప్రకాష్‌రెడ్డి, కొర్రపాడుకు రాచమల్ల సోముశేఖర్, చెన్నంపల్లికి ఆలం నాగార్జన ఏకగీవ్రమయ్యారు.
బుక్కరాయసముద్రం, డిసెంబరు14: మం డలంలో చెదరుమదురు సంఘటనలు మినహా సాగు నీటి సంఘం, మైనర్‌ఇరిగేషన, హెచ్చెల్సీ డిస్ర్టిబ్యూటరీ సంఘాల చైర్మన్ల ఎన్నికలు ప్ర శాంతంగా జరిగాయి. అన్నింటికి టీడీపీ మద్దతు దారులను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. హెచ్చె ల్సీ ఆయకట్లు కింద ఉన్న పొడరాళ్ల సంఘం చైర్మనగా పామురాయి రామ్మెహన, జంతు లూ రుకు సూర్యప్రకాష్‌రెడ్డి, కొర్రపాడుకు రాచమల్ల సోముశేఖర్, చెన్నంపల్లికి ఆలం నాగార్జన ఏకగీవ్రమయ్యారు. సిద్దరాంపురం చెరువుకు సం బంధించి టీడీపీలోని రెండు వర్గాల మధ్య తొ లుత పోటీ నెలకొంది. దీంతో అనంతపురం రూ రల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు అధ్వర్యంలో ఇటుకల పల్లి సీఐ హేమంత కుమార్, స్పెషల్ పార్టీ సిబ్బందితో పాటు మరో 30 మంది పోలీసుల బందో బస్తు చేపట్టారు. చివరికి మరో వర్గం వారు పోటీకి దూరం కావడంతో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలిం గారెడ్డి మద్దతుదారుడిని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు.
చెరువుల చైర్మన్లు: బుక్కరాయసముద్రం చెరువు అధ్యక్షుడిగా వీ నారాయణస్వామి, నారాయణప్ప చెరువుకు చిన్నచితంబరి, సిద్దరాం పురం చెరువుకు శివయ్య, ఏడావులపర్తికి గోపాల్‌రెడ్డి, కేకేఆగ్రహారానికి చంద్రశేఖర్, చె న్నంపల్లి తూర్పు చెరువుకు నీలమ్మ , పడమటి చెరువుకు శ్రీకాంతరెడ్డిని ఏకగీవ్రంగా ఎన్నుకు న్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన చెరువుల చైర్మన్లు, హెచ్చెల్సీ ఆయకట్టు చైర్మన్లకు ఎమ్మెల్యే బండా రు శ్రావణీశ్రీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్‌బాబు, కన్వీనర్ అశోక్‌కుమార్, జిల్లా టీడీపీ నేత పసుపుల శ్రీరామిరెడ్డి అభినందనలు తెలిపారు.
ఆత్మకూరు: మండల పరిధిలోని బి యాలేరు సాగునీటి సంఘం చైర్మనగా బండి ముసలన్న, వైస్ చైర్మనగా సాలప్ప, మదిగుబ్బ సాగునీటి సంఘం చైర్మనగా జింకల రంగప్ప, వైస్ చైర్మన చిట్రా నాగభూషణం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తహసీల్దార్ లక్ష్మనాయక్ తెలిపారు. ఎన్నికల అనంతరం వారు ఎమ్మెల్లే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ను కలిసి కృతజ్ఝతలు తెలియజేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....