OFFICE : అధికారులు, ఉద్యోగుల కొరత
ABN , Publish Date - Dec 12 , 2024 | 11:54 PM
వివిధ రకాల ప్రజా సేవలతో ముడిపడి ఉన్న తహసీ ల్దార్ కార్యాలయాలు అధికారుల కొరతతో కొట్టుమిట్టా డుతున్నాయి. దీంతో నిత్యం పనుల నిమిత్తం ఆ కార్యా లయాలకు వచ్చే ప్రజలు నిస్సహాయ స్థితిలో ఇబ్బం దులు పడుతున్నారు. సకాలంలో పనులు జరగడం లేదని నిట్టూర్పు విడుస్తున్నారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ పరిస్థితి కనిపి స్తోంది. రూరల్, అర్బన తహసీల్దార్ కార్యాలయాల్లో పలు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్బన, రూరల్ తహసీల్దార్ కార్యాలయాల్లో కీలక పోస్టులు ఖాళీ
వీఆర్వోలతో కాలం వెళ్లదీస్తున్న వైనం
మూడు నెలలుగా ఇదే పరిస్థితి
ప్రజాసేవాలపై ప్రభావం
అనంతపురం రూరల్, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): వివిధ రకాల ప్రజా సేవలతో ముడిపడి ఉన్న తహసీ ల్దార్ కార్యాలయాలు అధికారుల కొరతతో కొట్టుమిట్టా డుతున్నాయి. దీంతో నిత్యం పనుల నిమిత్తం ఆ కార్యా లయాలకు వచ్చే ప్రజలు నిస్సహాయ స్థితిలో ఇబ్బం దులు పడుతున్నారు. సకాలంలో పనులు జరగడం లేదని నిట్టూర్పు విడుస్తున్నారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ పరిస్థితి కనిపి స్తోంది. రూరల్, అర్బన తహసీల్దార్ కార్యాలయాల్లో పలు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్బన కార్యా లయంలో రెగ్యులర్ సర్వేయర్, ఆర్‌ఐతో పాటు సీనియర్ అసి స్టెంటు, జూనియర్ అసిస్టెంటు పోస్టులు ఖాళీగా ఉన్నా యి. ఇక రూరల్ కార్యాలయంలో డిప్యూటి తహసీల్దార్ పోస్టుతో పాటు జూనియర్ అసిస్టెంటు పోస్టు ఖాళీగా ఉంది. గత మూడు నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి. దీంతో గ్రామ రెవెన్యూ అధికారులే దిక్కుగా మారారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయాల్లోనే ఇలా ఉన్నా జిల్లా ఉన్నాతాధికారులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రభావం కాస్త ప్రజలకు అందే సేవలపై పడుతోంది.
అర్బన కార్యాలయంలో...
అనంతపురం అర్బన కార్యాలయం పరిధిలో 50 డివి జన్లు, నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు రెండు లక్ష లకు పైగా జనాభా ఉంది. వీరికి సేవలందించేందుకు తహసీల్దార్ కార్యాల యంలో తహసీల్దార్, డిప్యూటీ తహ సీల్దార్ తప్ప దాదాపు మిగిలి న సిబ్బంది ఎవరూ లేరు. ఇక్కడ ఉన్న ఉద్యోగులు గత మూడు నెలల కిందట జరిగి న బదిలీల్లో వెళ్లిపోగా, వారి స్థానాల్లో ఎవరినీ నియమిం చ లేదు. కార్యాలయంలో చా లా కీలకమైన సీనియర్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు పోస్టులే ఖాళీగా ఉన్నాయి. దీంతో వార్డు సచివాలయాల్లో పనిచే స్తున్న వీర్వోలను కార్యాలయంలోని విధులకు ఉపయోగిస్తు న్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవాలందించా ల్సిన వీఆర్వోలు కార్యాలయంలోని విధులకే పరిమిత మైపోయారు. దీనికి తోడు ఉన్న వీఆర్వోల్లోనూ పదిమందికి పైగా వ్యక్తిగత సెలవుల్లో వెళ్లిపోయారు. దీంతో ఆయా వీఆర్వోల స్థానంలో ఇనచార్జ్ బాధ్యత లు చేపట్టిన వీర్వోలు తీవ్ర పని ఒత్తిడికి లోనవుతు న్నారు. అంతేగాకుండా మండల రెగ్యులర్ సర్వేయర్ ఆర్‌ఐ, లేకపోవడం మరింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల అనంతపురం రూరల్ పంచా యతీ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సైతం ఈ సమస్యను జేసీ శివనారాణ్ శర్మ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్య పై కలెక్టర్‌ను కూడా కలిసినట్లు ఆయా వర్గాలద్వారా తెలుస్తోంది. ఉన్న అధికారులను సైతం వేరే చోట్లకు పంపివేసి అర్బన తహసీల్దార్ కార్యాలయాన్ని పూర్తి మూసేస్తే బాగుంటుందంటూ ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
రూరల్ కార్యాలయంలోనూ...
ఇక రూరల్ కార్యాలయం పరిస్థితి కూడా దుస్థితి ఏమాత్రం తీసిపోదు. కార్యాలయం పరిధిలో 21 పం చాయతీలున్నాయి. దాదాపు రెండులక్షల వరకు జనా భా ఉంది. అయితే కార్యాలయంలో అనుగుణంగా అ ధికారులు, ఉద్యోగులు లేరు. డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండి దాదాపు మూడు నెలలు దాటిం ది. బదిలీల్లో ఇక్కడకు నియమించిన వారు పాతసా ్థనాలకే వెళ్లిపోయారు. దీంతో డీటీ పోస్టు ఖాళీగా ఉంది. ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్టు అలాగే ఉంది. మూ డునెలల కిందట బదిలీల్లో భాగంగా కలెక్టరేట్‌లో పని చేస్తున్న ఓ ఉద్యోగిని నియమించారు. అయితే ఆయన తిరిగి డిప్యూటేషనపై పాతస్థానానికే వెళ్లిపో యారు. అధికారులు, ఉద్యోగులు లేకపోవడంతో వీ ఆర్వోలు కార్యాలయంలోని పనులు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఐదారుగురు వీఆర్వోలు వ్యక్తిగత దీర్ఘ కాలిక సెలవుల్లో వెళ్లిపోయారు. ఈనేపథ్యంలో ఉన్న వారిపై అదనపు భారం పడుతోంది. ఇలా తహసీల్దార్ కార్యాలయాల్లో కీలకపోస్టులు ఖాళీగా ఉండటంతో ఇటు అధికారు లు..అటూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం
- హరికుమార్, అర్బన తహసీల్దార్, మోహనకుమార్, రూరల్ తహసీల్దార్
కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి ఉన్నతాధికారులకు నివేదించాం. అధికారులు, ఉద్యోగు లు లేకపోయినప్పటికీ ప్రజలకు అందించే సేవల్లో ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....