Share News

AGITATION ; ఇళ్లకు పట్టాలివ్వండి

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:09 AM

మండలంలోని పాలసముద్రం జాతీయ రహదారి కూడలి వద్ద ప్రభుత్వ స్థలంలో నివాసముంటున్న పేదలకు హక్కు పత్రాలివ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమ వారం గోరంట్ల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు హనుమయ్య ఆధ్వర్యంలో కూడలి వద్ద నివాసమున్న పేదలు సోమవారం ఆందోళన చేపట్టారు.

AGITATION ; ఇళ్లకు పట్టాలివ్వండి
Residents of Palasamudram are agitating for housing sites

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరుపేదల ఆందోళన

గోరంట్ల, సెప్టెంబరు 9: మండలంలోని పాలసముద్రం జాతీయ రహదారి కూడలి వద్ద ప్రభుత్వ స్థలంలో నివాసముంటున్న పేదలకు హక్కు పత్రాలివ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమ వారం గోరంట్ల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు హనుమయ్య ఆధ్వర్యంలో కూడలి వద్ద నివాసమున్న పేదలు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హాజరైన సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ మాట్లాడుతూ...


తమకు పట్టాలివ్వాలని పాల సముద్రంలోని సర్వేనెంబర్‌ 125లో కొంతకాలంగా నివాసమున్నవారు పలుమార్లు రెవెన్యూ అధికారుల విన్నవించారని అన్నారు. ఇళ్లు లేనివారికి నిబంధనల మేరకు పట్టాలు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని వీఆర్‌ఓ అనిల్‌కు వినతిపత్రం అందించారు. సమస్య పరిష్కరించకపోతే ఈనెల 18న పేదలతో వెళ్లి ఆర్డీఓను కలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం నాయకురాలు స్వర్ణలత, ఆంజనేయులు, వెంకటేష్‌, ఆంజనాదేవి, ముత్యాలప్ప, షాతాజ్‌, నంజుడప్ప, ప్రదీప్‌, రామాంజనమ్మ, లక్ష్మీదేవి, గంగమ్మ, శోభ తదితరులు ఉన్నారు.

పెనుకొండ: ఇల్లులేని నిరుపేదలకు ఇంటిపట్టాలు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పలువురు పేదలు తహసీల్దార్‌ కా ర్యాలయంలో వినతి పత్రం అందించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గంగాధర్‌, కార్మిక సంఘం ఆఫీస్‌ బేరర్‌ నారాయణ, తదితరులు సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌కు బేబీకి అందించారు.


పట్టణంలోని సర్వేనంబరు 668లో గుడిసెలు వేసుకుని జీవనం సాగి స్తున్న పేదలందరికీ ఇంటిపట్టాలు మంజూరుచేయాలని డిమాండ్‌ చేశారు. ఇక్కడ జీవనం చేస్తున్న వారి గుడిసెలను ఏడాది క్రితం పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు తొలగించారన్నారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించగా కోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చిం దన్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌, సబ్‌కలెక్టర్‌, కమిషనర్‌ను కోరగా ఎన్నికల తరువాత పట్టాలు ఇస్తామని మాట ఇచ్చారన్నారు. ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదన్నారు. కోర్టు ఆదేశాలను అనుసరించి వెంటనే ఇంటిపట్టాలు మంజూరు చేయాలని కోరారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 10 , 2024 | 12:10 AM