Share News

SP : రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం

ABN , Publish Date - Dec 06 , 2024 | 12:30 AM

రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టడానికి ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ వి.రత్న సూచించారు. రామగిరి పోలీస్‌సర్కిల్‌ పరిధిలోని చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి పోలీస్‌స్టేషన్లను ఎస్పీ గురువారం తనిఖీ చేశారు. ఆయా స్టేషన్లలో రికా ర్డులను పరిశీలించి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకు న్నారు. ప్రధానంగా సమస్యాత్మక గ్రామాలతో పాటు ఫ్యాక్షన గ్రామాల పరిస్థితి గురించి డీఎస్పీ శ్రీనివాసు లు, సీఐ శ్రీధర్‌తో ఆరాతీశారు.

SP : రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం
SP talking to people in Tagarakunta

పటిష్టమైన చర్యలు చేపట్టండి : ఎస్పీ వి. రత్న

చెన్నేకొత్తపల్లి,/రామగిరి/కనగానపల్లి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టడానికి ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ వి.రత్న సూచించారు. రామగిరి పోలీస్‌సర్కిల్‌ పరిధిలోని చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి పోలీస్‌స్టేషన్లను ఎస్పీ గురువారం తనిఖీ చేశారు. ఆయా స్టేషన్లలో రికా ర్డులను పరిశీలించి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకు న్నారు. ప్రధానంగా సమస్యాత్మక గ్రామాలతో పాటు ఫ్యాక్షన గ్రామాల పరిస్థితి గురించి డీఎస్పీ శ్రీనివాసు లు, సీఐ శ్రీధర్‌తో ఆరాతీశారు. అదే విధంగా ట్రాపిక్‌పై దృష్టి సారించాలన్నారు. భూతగాదాల విషయంలో అప్రమత్తం గా ఉండాలని బాలికల అదృశ్యాలపై ప్రత్యేక దృష్టి సారిం చాలన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల న్నారు. ప్రమాదాల ఘటనలో అధికంగా మృత్యువాత పడుతున్నారన్నారు. కుంటిమద్ది చెరువుకట్టపై ఏర్పాటు చేసిన పైలానను పరిశీలించారు. కనగానపల్లి పోలీస్‌స్టేషన ఆవరణంలో ఎస్పీ పండ్లమొక్కలను నాటారు. అలాగే ఎస్పీ కనగానపల్లి మండలంలోని ఫ్యాక్షన గ్రామమైన తగరకుం టను సందర్శించారు. గ్రామస్థులతో మాట్లాడారు... ప్యా క్షన జోలికి వెళ్లవద్దని ప్రశాంతంగా జీవించాలని సూచిం చారు. కార్యక్రమంలో రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌, కనగానపల్లి ఎస్‌ఐ మహమ్మద్‌ రిజ్వాన, స్పెషల్‌ బ్రాంచ ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 06 , 2024 | 12:30 AM