ENERGY : విద్యుత ఆదాతో భవిష్యత్తులో వెలుగులు
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:08 AM
విద్యుత్తు ఆదా చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడు కోవచ్చని, భవిష్యత తరా లకు వెలుగులు అందించ వచ్చ ని విద్యుత శాఖ ఎస్‌ఈ సంపత కుమార్ పేర్కొన్నారు. విద్యుత్తు పొదుపు వారోత్సవాల్లో భాగంగా గురువారం గుత్తిరోడ్డులోని మాంటిస్సోరీ స్కూల్‌లో విద్యుత్తు శాఖ డి-6సెక్షన ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యా సరచన, వకృత్వ పోటీలు నిర్వహించారు.
ఎస్‌ఈ సంపతకుమార్
అనంతపురం రూరల్/ విద్య, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు ఆదా చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడు కోవచ్చని, భవిష్యత తరా లకు వెలుగులు అందించ వచ్చ ని విద్యుత శాఖ ఎస్‌ఈ సంపత కుమార్ పేర్కొన్నారు. విద్యుత్తు పొదుపు వారోత్సవాల్లో భాగంగా గురువారం గుత్తిరోడ్డులోని మాంటిస్సోరీ స్కూల్‌లో విద్యుత్తు శాఖ డి-6సెక్షన ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యా సరచన, వకృత్వ పోటీలు నిర్వహించారు. ఎస్‌ఈ సంపతకుమార్, టౌనడివిజన ఈఈ జేవీ రమేష్ హాజరై మాట్లాడారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన ప్రసన్న, గీతిక, భువన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన శివప్రజ్ఞ, షాహిద్, రితీషకు ముఖ్యఅథితుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో డీఈఈలు శ్రీనివాసులు, రామకృష్ణ, ఏఈఈ ప్రసాద్, ఏఓ గంగన్న, పాఠశాల కరస్పాండెంట్ సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....