DASARA : లోకమాతా పాహిమాం ..!
ABN , Publish Date - Oct 06 , 2024 | 11:53 PM
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున ఆది వారం అమ్మవారు జిల్లావ్యాప్తంగా వివిధ రూపాల్లో దర్శనమి చ్చారు. ఇందులో భాగంగా జిల్లాకేంద్రంలోని వివిధ ఆలయాల్లో అమ్మ వార్ల మూలవిరాట్లతో పాటు ఉత్సవమూ ర్తులను ప్రత్యే కంగా అలంకరించి విశేష పూజా కార్య క్రమాలు నిర్వహించారు.
అనంతపురం కల్చరల్ : దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున ఆది వారం అమ్మవారు జిల్లావ్యాప్తంగా వివిధ రూపాల్లో దర్శనమి చ్చారు. ఇందులో భాగంగా జిల్లాకేంద్రంలోని వివిధ ఆలయాల్లో అమ్మ వార్ల మూలవిరాట్లతో పాటు ఉత్సవమూ ర్తులను ప్రత్యే కంగా అలంకరించి విశేష పూజా కార్య క్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామా లయం లోఅమ్మవారి ఉత్సవమూర్తిని వైష్ణవీదేవిగా అలంకరించి గరుడవాహనంపై ఆశీనులను చేశారు. సూర్యనగర్ 80అడుగుల రోడ్డులోని మ ల్లాలమ్మ ఆలయంలో అమ్మవారికి రాజరాజేశ్వరి అ లంకారం, పాతూరులోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆవరణలోని కాళికామాత దేవావాలయంలో అమ్మవారికి లలితాదేవి అలంకారం, శివబాలయోగి ఆశ్రమంలో కామాక్షి అలంకారం చేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....