STUDENTS : బడికి దూరంగా భోజనం..!
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:16 PM
చేతిలో భోజనం ప్లేట్లు పట్టుకుని వెళుతున్న వీరు బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు. గ్రామంలో ఉన్న పాఠశాలలో గదుల కొరత ఉంది. దీంతో ఉన్నత పాఠశాల భవనాన్ని ఊరికి దూరంగా నిర్మిస్తున్నారు. పనులు పూర్తి కాకనే.. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులను అక్కడికి తరలించి.. పాఠాలు చెబుతున్నారు. కానీ మధ్యాహ్న భోజనం మాత్రం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే పెడుతున్నారు. దీంతో రోజూ ఇలా కి.మీ. దూరం తట్టలు ఎత్తుకుని ...
చేతిలో భోజనం ప్లేట్లు పట్టుకుని వెళుతున్న వీరు బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు. గ్రామంలో ఉన్న పాఠశాలలో గదుల కొరత ఉంది. దీంతో ఉన్నత పాఠశాల భవనాన్ని ఊరికి దూరంగా నిర్మిస్తున్నారు. పనులు పూర్తి కాకనే.. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులను అక్కడికి తరలించి.. పాఠాలు చెబుతున్నారు. కానీ మధ్యాహ్న భోజనం మాత్రం గ్రామంలోని ప్రాథమిక
పాఠశాలలోనే పెడుతున్నారు. దీంతో రోజూ ఇలా కి.మీ. దూరం తట్టలు ఎత్తుకుని విద్యార్థులు ఊరిలో ఉండే బడి వద్దకు వచ్చి.. భోజనం చేసి వెళుతున్నారు. మరికొందరు అంత దూరం నడవలేక మధ్యాహ్నం పస్తులు ఉంటున్నారు. ఫొటో తీయబోతే.. కొందరు విద్యార్థులు బిడియంతో ముఖానికి ఖాళీ ప్లేట్లను అడ్డుగా పెట్టుకుని పరుగులు తీశారు. సిగ్గు పడాల్సింది ఈ చిన్నారులా..? ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులా..?
- బొమ్మనహాళ్
మరిన్ని అనంతపురం వార్తల కోసం..