SHASHTIPURTI : వైభవంగా సామూహిక షష్టిపూర్తి
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:52 AM
సాయి ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం నగర శివారులోని ఓ ఫంక్షనహాల్‌లో చేపట్టిన సామూహిక షష్టిపూర్తి కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ నేపథ్యంలో తిరుక్కడయురి అభిరామ అమ్మవారి క్షేత్రానికి చెందిన వెంకటేష్ స్వామి శిష్యబృందం నేతృత్వంలో 170 మంది దంపతులకు మంగళస్నానాలు, గోపూజ, రుద్రాభిషేకాలతో పాటు లక్ష్మీ వెంకటేశ్వరస్వామి, సీతారాములు, శివపార్వతుల కల్యాణోత్సవాలు నిర్వహించారు.
అనంతపురం కల్చరల్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : సాయి ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం నగర శివారులోని ఓ ఫంక్షనహాల్‌లో చేపట్టిన సామూహిక షష్టిపూర్తి కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ నేపథ్యంలో తిరుక్కడయురి అభిరామ అమ్మవారి క్షేత్రానికి చెందిన వెంకటేష్ స్వామి శిష్యబృందం నేతృత్వంలో 170 మంది దంపతులకు మంగళస్నానాలు, గోపూజ, రుద్రాభిషేకాలతో పాటు లక్ష్మీ వెంకటేశ్వరస్వామి, సీతారాములు, శివపార్వతుల కల్యాణోత్సవాలు నిర్వహించారు. తదనంతరం హైదరాబాద్‌కు చెందిన గోవిందపీ ఠం గోవర్ధనం వెంకటాచార్యులు పురంధరనారాయణస్వామి పర్యవేక్షణలో దేవరకొండ బాలాజీశర్మ, గిరిప్రసాద్‌శర్మ, అర్చక బృందం సామూహిక షష్టిపూర్తిని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయి ట్రస్టు అధ్యక్షుడు విజయసాయికుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటి మేయర్ వాసంతి సాహిత్య, బల్లా కన్వెన్షన అంబటి అఖిల్, సాయిట్రస్టు సిబ్బంది, షష్టి పూర్తి చేసుకున్న దంపతులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....