Share News

DEVOTIONAL : కన్నులపండువగా మహా పడిపూజ

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:45 AM

మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయ హరిహరసుత అ య్యప్పస్వామి దేవాలయం లో శనివారం సాయంత్రం స్వామివారి మహాపడిపూజోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉద యం మూలవిరాట్‌కు విశే ష పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ఆవరణలోని వేదికపై గణపతి, లక్ష్మి, అయ్యప్పస్వామి ఉత్సవమూర్తులను ఉంచి, ప్రత్యేక అలంకరణ చేశారు.

DEVOTIONAL : కన్నులపండువగా మహా పడిపూజ
A scene of worship

అనంతపురం కల్చరల్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయ హరిహరసుత అ య్యప్పస్వామి దేవాలయం లో శనివారం సాయంత్రం స్వామివారి మహాపడిపూజోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉద యం మూలవిరాట్‌కు విశే ష పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ఆవరణలోని వేదికపై గణపతి, లక్ష్మి, అయ్యప్పస్వామి ఉత్సవమూర్తులను ఉంచి, ప్రత్యేక అలంకరణ చేశారు. గురుస్వాములు రంగాచారి, ప్రసాద్‌ నంబూద్రి నేతృత్వంలో పడిపూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీక్షధారుల అయ్యప్ప శరణుఘోషతో ఆ ప్రాంతం మార్మోగింది. అనంతరం దీక్షధారులకు భిక్ష అంద జేశారు. ఆలయ ఈఓ సాకే రమేష్‌బాబు, కోఆప్షన మెంబర్‌ గంగన లక్ష్మి రెడ్డి, గురుస్వాములు శ్రీనివాసులు, ఆంజనేయులు, వెంకటనారాయణ, రామ్‌ నారాయణ, చలపతి, ఏఎంసీ శ్రీనివాసులు, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఘనంగా అయ్యప్ప గ్రామోత్సవం

బుక్కరాయసముద్రం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో శనివారం అయ్యప్ప స్వామి గ్రామోత్స వం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. మధ్యాహ్నం ఆలయం వద్ద అన్నదానం చేశారు. సా యంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి, ప్రత్యేక వాహనంపై పురువీధుల్లో ఊ రేగించారు. అయ్యప్ప మాల ధారులు భజన కీర్తనలు పాడుతూ, నృత్యాలు చేస్తూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కేశన్న, అశోక్‌ కుమార్‌, శివకుమార్‌, పోతలయ్య, కంఠశేఖర్‌, గొట్లూరు నరేష్‌, సురేష్‌, రాము, మారతీప్రసాద్‌, నాగేంద్ర, బండిగిరి, ఓంకార్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 22 , 2024 | 12:45 AM