DASARA : మహాలక్ష్మీ నమోస్తుతే..!
ABN , Publish Date - Oct 09 , 2024 | 12:06 AM
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజున మంగళవారం అమ్మ వారు పలుప్రాంతాల్లో లక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాల్లో మూలవిరాట్లతోపాటు ఉత్సవమూ ర్తులను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించా రు. కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మూలవిరాట్‌ను వక్కలతో అలంకరించి, ఆలయ ఆవరణలో ఉత్సవ మూర్తులతో కంచి కా మాక్షి, వాసవీదేవి, సంతోషిమాత అలంకారం చేశారు.
అనంతపురం కల్చరల్ : దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజున మంగళవారం అమ్మ వారు పలుప్రాంతాల్లో లక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాల్లో మూలవిరాట్లతోపాటు ఉత్సవమూ ర్తులను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించా రు. కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మూలవిరాట్‌ను వక్కలతో అలంకరించి, ఆలయ ఆవరణలో ఉత్సవ మూర్తులతో కంచి కా మాక్షి, వాసవీదేవి, సంతోషిమాత అలంకారం చేశారు. పాతూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మూలవిరాట్‌ను లేసులతో అలంకరించి, ఆల య ఆవరణలోని ఉత్సవ మూర్తులతో గంగాసమేత శివపార్వతుల అలంకా రం చేసి పూజా కైంకర్యాలు నిర్వహించారు. మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో అమ్మవారి మూలవిరాట్‌ను పార్వతీదేవిగా, ఉత్స వమూర్తిని ఇంద్రాణిగా అలంకరించి గజవాహనంపై ఆశీనులను చేశారు. రామచంద్ర నగర్ షిర్డీసాయి ఆలయంలో రూ.10లక్షల నగదుతో మహాలక్ష్మి దేవి అలంకారం చేశారు. పాతూరులోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఆవరణలో ఉన్న కాళికామాత ఆలయంలోలలితాదేవిగా, శివబాలయోగి ఆశ్రమంలో మీనాక్షిదేవిగా అలంకరించారు. శంకరమఠంలోని శారదాదేవిని వీణాసరస్వతిగా అలంకరించడంతోపాటు దాదాపు 50 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. జొన్నా వీరయ్య కాలనీలోని శివశక్తి ఆలయం లో అమ్మవారిని గజలక్ష్మిగా అలంకరించడంతో పాటు ఆలయ ఆవరణలో భక్తులు సామూహిక కుంకుమార్చన చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....