CONGRESS : దేశాన్ని ఆర్థిక అగ్రగామిగా నిలిపిన మహనీయుడు
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:19 AM
ప్రపంచదేశాల్లో భారత దేశాన్ని ఆర్థిక అగ్రగామిగా నిలిపిన మహనీయుడు మాజీ ప్రధాని మన్మోహన సింగ్ అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కొనియాడారు. నగరంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన సింగ్ సంతాప కార్యక్రమం నిర్వహించారు.
ఫమాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఫ మాజీ ప్రధాని మన్మోహనకు నివాళి
అనంతపురం న్యూటౌన, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రపంచదేశాల్లో భారత దేశాన్ని ఆర్థిక అగ్రగామిగా నిలిపిన మహనీయుడు మాజీ ప్రధాని మన్మోహన సింగ్ అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కొనియాడారు. నగరంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన సింగ్ సంతాప కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి శైలజానాథ్, ఇతర నాయకులు మన్మోహన సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ.. అనేక రకాల ఆర్థిక సంస్కరణ లను ప్రవేశపెట్టి అన్ని రంగాలను గాడిన పెట్టగలిగారని గుర్తు చేసుకున్నారు. ఆయన మొదట జిల్లాకు వచ్చి ఉపాధి హామీ పథకం ప్రారంభించారని, మరో సారి పదేళ్ల తరువాత పరిశీలించారని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడు దాదాగాంధీ, నాయకులు శివశంకర్ యాదవ్, వాసు, శర్మాస్‌వలి, కొండారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శింగనమల: మాజీ ప్రధానమంత్రి మన్మోహన సింగ్‌కు కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులర్పించారు. శింగనమల ఆర్టీసీ బస్టాండ్ అవరణంలో అంబేడ్కర్ విగ్ర హం వద్ద శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రావ్ చరణ్‌యాదవ్ ఆధ్యర్యంలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాలర్పించారు. కాంగ్రెస్ నాయకులు గంగారాజు, రఫి, జాన, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....