BOOK LAUNCH ; ‘మట్టి మట్టి’ పుస్తకావిష్కరణ
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:32 AM
రైతు జీవన చిత్రణ ‘మట్టి మట్టి’ కవితా సంపుటి అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. కవి దర్భశయనం శ్రీనివాసాచార్య రచించిన ‘మట్టి మట్టి’ కవితా సంపుటి పుస్తక ఆవిష్కరణ సభను శుక్రవారం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని కామర్స్ సెమినార్ హాల్‌లో నిర్వహించారు.
అనంతపురం కల్చరల్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : రైతు జీవన చిత్రణ ‘మట్టి మట్టి’ కవితా సంపుటి అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. కవి దర్భశయనం శ్రీనివాసాచార్య రచించిన ‘మట్టి మట్టి’ కవితా సంపుటి పుస్తక ఆవిష్కరణ సభను శుక్రవారం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని కామర్స్ సెమినార్ హాల్‌లో నిర్వహించారు. స్పందన అనంత కవుల వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ శ్రీరాములు నాయక్, సీనియర్ కవులు తూముచెర్ల రాజారామ్, అంకె శ్రీనివాస్, శాంతినారాయణ, ఉప్పరపాటి వెంకటేశు లు, తరిమెల అమరనాథరెడ్డి, రియాజుద్దీన, చెట్ల ఈరన్న, తెలుగు అధ్యాపకుడు యోగేశ్వరనాయుడు, అంకె మదనమోహన పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....