Share News

HOSPITAL : జిల్లా ఆస్పత్రి సిబ్బందికి వైద్యపరీక్షలు

ABN , Publish Date - Sep 28 , 2024 | 12:17 AM

జిల్లా సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న వివిధ కేడర్ల కు చెందిన సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించా రు. స్వచ్ఛతాహిసేవ కార్యక్రమంలో బాగంగా శుక్రవారం ఆస్పత్రిలో వైద్య శిబిరం నిర్వహించారు. పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది, ఎంఎన ఓలు, ఎఫ్‌ఎనఓలు, డైట్‌ సిబ్బందికి రక్తపరీక్షలు, ఈసీజీ, క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు, షుగర్‌, బీపీ పరీక్షలు నిర్వహించారు. కామెర్ల వ్యాధి రాకుండా ఉండేందుకు హెపటైటీస్‌ వ్యాక్సిన వేశారు.

HOSPITAL :  జిల్లా ఆస్పత్రి సిబ్బందికి వైద్యపరీక్షలు
Superintendent, Principal, RMOs with hospital staff in medical camp

అనంతపురం టౌన, సెప్టెంబరు27: జిల్లా సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న వివిధ కేడర్ల కు చెందిన సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించా రు. స్వచ్ఛతాహిసేవ కార్యక్రమంలో బాగంగా శుక్రవారం ఆస్పత్రిలో వైద్య శిబిరం నిర్వహించారు. పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది, ఎంఎన ఓలు, ఎఫ్‌ఎనఓలు, డైట్‌ సిబ్బందికి రక్తపరీక్షలు, ఈసీజీ, క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు, షుగర్‌, బీపీ పరీక్షలు నిర్వహించారు. కామెర్ల వ్యాధి రాకుండా ఉండేందుకు హెపటైటీస్‌ వ్యాక్సిన వేశారు. అనంతరం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మాణిక్యాలరావు మాట్లాడుతూ... ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ఇక్కడకు వచ్చే రోగులకు మంచి వైద్యసేవలు అందుతాయన్నారు. ఈ లక్ష్యంతోనే సిబ్బందికి వివిధ రకాల పరీక్షలు నిర్వహంచామని తెలిపారు. అలాగే ఆస్పత్రిలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినపుడే వ్యాధులు ప్రబలవని ప్రతి ఒక్కరు అందుకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓలు డాక్టర్‌ పద్మజ, డాక్టర్‌ హేమలత, డీఐఓ డాక్టర్‌ యుగందర్‌, పలువురుడాక్టర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 28 , 2024 | 12:18 AM