EX-MINISTER PALLE: ఆరోగ్యానికి ధ్యానం అవసరం
ABN , Publish Date - Oct 07 , 2024 | 12:36 AM
మారుతున్న కాలానుగుణంగా మనిషి జీవితం, నిత్యం ఒత్తిడికి గురవుతున్నారని ప్రశాంత జీవనానికి ధ్యానం ఎంతైనా అవసరమంటూ మాజీ మంత్రిపల్లెరఘునాథరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వాసవీ నివా్‌సలో బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్-8 నిర్వహించారు.
పుట్టపర్తి, అక్టోబరు 6: మారుతున్న కాలానుగుణంగా మనిషి జీవితం, నిత్యం ఒత్తిడికి గురవుతున్నారని ప్రశాంత జీవనానికి ధ్యానం ఎంతైనా అవసరమంటూ మాజీ మంత్రిపల్లెరఘునాథరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వాసవీ నివా్‌సలో బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్-8 నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పల్లె మాట్లాడుతూ...మనిషి జీవితం పోటీతత్వంలో సాగుతోందని, దీంతో ప్రశాంతత కొరవడిందన్నారు. ధ్యానంతో వాటిని దూరం చేయవచ్చన్నారు. వాసవీ నివాస్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం అభినందనీయమన్నారు. అనంతరంవాసవీ పాఠశాల ఉపాధ్యాయులకు దసరా పండుగ సందర్బంగా నూతన వస్ర్తాలను పంపిణీచేశారు. ఆర్యవైశ్యసంఘం రాష్ట్ర కార్యవర్గసభ్యులు సిద్దానాగేశ్వరరావు, కోటాసత్యం, హనుమంతరావు, బాలక్రిష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ఓబుళదేవరచెరువు: అర్హులైన పేదలంరికీ సంక్షేమ ఫలాలు అందచేస్తామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానికంగా ఆయన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సీఎం చంద్రబాబు దశలవారీగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వందరోజులు పూర్తిచేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించామన్నారు. కన్వీనర్ జయచంద్ర, మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబులరెడ్డి, బోరు రమణ, నిజాం, మీసేవ సుధాకర్, శివారెడ్డి పాల్గొన్నారు.