Share News

CITU : ఎంహెచఓను సస్పెండ్‌ చేయాలి

ABN , Publish Date - Oct 19 , 2024 | 12:23 AM

కార్మికులకు అన్యాయం చేస్తున్న అవినీతి ఎంహెచఓ విష్ణుమూర్తిని వెంటనే సస్పెండ్‌ చేయాలని లేని పక్షంలో బదిలీ చేసి పంపాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై శుక్రవారం మున్సిపల్‌ యూనియన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏటీఎం నాగరాజు, నాగభూషణం ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఆందోళన చేపట్టారు.

CITU : ఎంహెచఓను సస్పెండ్‌ చేయాలి
Agitating workers at the municipal office

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

కార్మికుల సమస్యలపై వద్ద ఆందోళన

అనంతపురం క్రైం,అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : కార్మికులకు అన్యాయం చేస్తున్న అవినీతి ఎంహెచఓ విష్ణుమూర్తిని వెంటనే సస్పెండ్‌ చేయాలని లేని పక్షంలో బదిలీ చేసి పంపాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై శుక్రవారం మున్సిపల్‌ యూనియన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏటీఎం నాగరాజు, నాగభూషణం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... పనిముట్ల విష యంలో అవినీతికి పాల్పడిన ఎంహెచఓపై చర్యలు తీసుకోకపోతే సోమ వారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదికను ముట్టడిస్తామని హెచ్చరించారు. రెగ్యులర్‌, ఎనఎంఆర్‌ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరారు. కార్మికులకు పనిముట్లు, రక్షణ పరికరాలు తది తరాలను సకాలంలో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గోడౌనలోని పాత పని ముట్లను బయటకు తీసి, రూ.5లక్షలు వెచ్చించి పనిముట్లు కొన్నామని చెబుతున్న అధికారులపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. సమస్య లను పరిష్కరించకపోతే దశలవారీ ఆందోళనలు చేపడుతామన్నారు. అనంతరం అడిషనల్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్‌కు వినతిపత్రం అందజే శారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆదినారాయ, నారాయణ స్వామి, బండారు ఎర్రిస్వామి, తిరుమలేష్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 19 , 2024 | 12:23 AM