Share News

India Book of Records : నాట్య మయూరాలు

ABN , Publish Date - Jun 20 , 2024 | 12:23 AM

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ఆలయాల వద్ద అద్భుత నృత్య ప్రదర్శనతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు తాడిపత్రి బాలికలు. మే 13, 15 తేదీల్లో మైనస్‌ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలో దాదాపు గంటన్నరపాటు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. తాడిపత్రికి చెందిన వందన డ్యాన్స అకాడమి విద్యార్థినులు సాయిమైత్రి, జోషిత, వర్ధిని, నవ్యశ్రీ, సాహిత్య, ...

 India Book of Records : నాట్య మయూరాలు
Students dancing at Kedarnath Temple

వణికించే చలిలో అద్భుత ప్రదర్శన.. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ఆలయాల వద్ద అద్భుత నృత్య ప్రదర్శనతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు తాడిపత్రి బాలికలు. మే 13, 15 తేదీల్లో మైనస్‌ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలో దాదాపు గంటన్నరపాటు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. తాడిపత్రికి చెందిన వందన డ్యాన్స అకాడమి విద్యార్థినులు సాయిమైత్రి, జోషిత, వర్ధిని, నవ్యశ్రీ, సాహిత్య, నిహారిక బృందం అద్భుత ప్రదర్శనకు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు


దక్కింది. కేదార్‌నాథ్‌ క్షేత్రానికి 25 కి.మీ. కాలినడకన వెళ్లి ఆలయం వద్ద దాదాపు గంటన్నరపాటు వీరు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. ఏప్రిల్‌ 23 నుంచి మే 15 వరకు వివిధ పుణ్యక్షేత్రాల్లో ప్రదర్శనలు ఇచ్చామని శిక్షకులు ప్రవీణ్‌, వందన తెలిపారు. తిరుపతి, కేరళ, ద్వారకానాథ్‌, గుజరాత, అయోధ్య, ఆగ్రా, హరిద్వార్‌, అక్షరధామ్‌ తదితర ఆలయాల వద్ద తమ విద్యార్థులు నృత్య ప్రదర్శన ఇచ్చారని అన్నారు.

- తాడిపత్రి టౌన


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 20 , 2024 | 12:23 AM