Share News

DASARA : నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Oct 04 , 2024 | 12:12 AM

మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాల యం ఆవరణలో ఉన్న శారదా శంకరాచార్యుల దేవాల యంలో వేడుకల ప్రారంభం సందర్భంగా ఉదయాన్నే కలశపూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి దీక్షా బంధనం గావించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో అమ్మవారి ఉత్సవ మూర్తిని హంసవాహనంపై ఆశీనుల నుచేశారు.

DASARA : నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
Women doing kumkumcharana at the Chaudeshwari temple on the first road

శ్రీమాత్రేనమః

మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాల యం ఆవరణలో ఉన్న శారదా శంకరాచార్యుల దేవాల యంలో వేడుకల ప్రారంభం సందర్భంగా ఉదయాన్నే కలశపూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి దీక్షా బంధనం గావించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో అమ్మవారి ఉత్సవ మూర్తిని హంసవాహనంపై ఆశీనుల నుచేశారు. బ్రాహ్మణీదేవిగా అలంకరించి పూజలు గావిం చారు. రామచంద్రనగర్‌లోని షిర్డిసాయి ఆలయంలో దుర్గామాతను బాలాత్రిపురసుందరిగా అలంకరించి పూ జించారు. బెంగళూరు రోడ్డులోని శివకోటి ఆలయంలో శివకామేశ్వరి మాతను అన్నపూర్ణేశ్వరి అలంకారం చేసి, ప్రత్యేక పూజాదులు నిర్వహించారు. అనంతరం భక్తులు సామూహిక కుంకుమార్చన, భజన కార్యక్రమాలు నిర్వ హించారు. ఐదోరోడ్డులో నల్లమల సుంకలమ్మ ఆల యంలో బాలా త్రిపురసుందరిదేవిగా, పాతూరులోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో బాలా త్రిపుర సుందరిదేవి అలంకారం, అశోక్‌నగర్‌లోని హరిహర దేవాలయంలో బాలాత్రిపురసుందరిగా అలంకరించారు. శారదానగర్‌లోని శివబాలయోగి ఆశ్రమంలో అమ్మవారిని భరతమాతగా అలంకరించారు. అలాగే తపో వనం లోని వేదమాత గాయత్రిదేవి ఆలయం, ఐదో రోడ్డులోని రేణుకా యల్లమ్మ, హెచ్చెల్సీ కాలనీలోని చాముండేశ్వరి, మొదటిరోడ్డు రేణుకా యల్లమ్మ, గుత్తి రోడ్డులోని రేణుకా యల్లమ్మ ఆలయాల్లోనూ అమ్మ వారిని రకరకాల రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహించారు. -అనంతపురం కల్చరల్‌


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 04 , 2024 | 12:12 AM