DASARA : నయనమనోహరం శయనోత్సవం
ABN , Publish Date - Oct 14 , 2024 | 12:36 AM
జిల్లా కేంద్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నాటికి ముగిశాయి. పాతూరు, కొత్తూరు అమ్మవారిశాలల్లో ఆదివారం సాయంత్రం శయనోత్సవ సేవలతో వేడుకలను ముగించారు. పాతూరు అమ్మవారి శాలలో వాసవీమాత మూలవిరాట్‌ను కొబ్బరితో అలంకరించి పూజించారు. ఆలయ ఆవరణలో ఉత్సవమూర్తితో శయనోత్సవ సేవ నిర్వహించారు.
అనంతపురం కల్చరల్, అక్టోబరు 13 : జిల్లా కేంద్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నాటికి ముగిశాయి. పాతూరు, కొత్తూరు అమ్మవారిశాలల్లో ఆదివారం సాయంత్రం శయనోత్సవ సేవలతో వేడుకలను ముగించారు. పాతూరు అమ్మవారి శాలలో వాసవీమాత మూలవిరాట్‌ను కొబ్బరితో అలంకరించి పూజించారు. ఆలయ ఆవరణలో ఉత్సవమూర్తితో శయనోత్సవ సేవ నిర్వహించారు. అదేవిధంగా కొత్తూరు అమ్మవారిశాలలో మూలవిరాట్‌ను వజ్రకవచ చీరతో అలంకరించి, సాయంత్రం ఆలయ కల్యాణమండపంలో ఉత్సవమూర్తికి ఊ యలసేవ చేశారు. భక్తులు విశేషంగా హాజరై వాసవీమాతను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోపామచ్చా నరసింహులు, ప్రధాన కార్యదర్శి మిట్టా ఆంజనేయలు, టంగుటూరు నాగభూషణ, కృష్ణం రఘు, పాతూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పిన్ని నాగరత్నం, ప్రధాన కార్యదర్శి చల్లా కృష్ణరంగయ్య, ధర్మకర్త గర్జాల నాగరాజు, దూపకుంట సాయినాథ్ గుప్త, తిరువీదుల జగదీష్‌కుమార్, కొత్తూరు, పాతూరు యువజన సంఘాలు, వాసవీ మహిళా మండలుల ప్రతినిధులు, కార్యవర్గసభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....