Share News

HOSTEL : విద్యార్థినుల భద్రతపై నిర్లక్ష్యం

ABN , Publish Date - Dec 04 , 2024 | 12:07 AM

ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థినులకు వసతి, భోజనం, విద్య ఏ స్థాయిలో అమలు పరుస్తారో.. వారి భధ్రత విషయంలోనూ అదేస్థాయిలో చర్యలు చేపటా ్టలి. తమ సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన బాధ్యత సం బంధిత వార్డెన్లపై ఉంటుంది. అయితే కొందరు వార్డెన్లు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవు తున్నాయి.

HOSTEL : విద్యార్థినుల భద్రతపై నిర్లక్ష్యం
Girls Hostel Complex

హాస్టళ్లలో నిబంధనలు గాలికి

పర్యవేక్షణాధికారులు, వార్డెన్ల వైఫల్యం

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థినులకు వసతి, భోజనం, విద్య ఏ స్థాయిలో అమలు పరుస్తారో.. వారి భధ్రత విషయంలోనూ అదేస్థాయిలో చర్యలు చేపటా ్టలి. తమ సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన బాధ్యత సం బంధిత వార్డెన్లపై ఉంటుంది. అయితే కొందరు వార్డెన్లు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవు తున్నాయి. నిబంధనల ప్రకారం విద్యార్థినులు ఉండే వసతిగృహాల్లోకి సాయంత్రం 6 గంటల తరువాత ఎవరికీ అనుమతి ఉండదు. అయితే జిల్లాలోని పలు వసతిగృహాల్లో అమలు కావడం లేదనే చెప్పాలి. సా యంత్రం 7.30 తరువాత కూడా అన్న, తమ్ముడు, బం ధువులంటూ హాస్టల్లోకి వెళ్లి వస్తున్నారు... మరికొన్ని చోట్ల విద్యార్థినులు తినుబండారాలు కొనేందుకు రాత్రి 8 గంటల సమయంలో హా స్టల్‌ దాటి బయటికొస్తు న్నా రు. ఆయా హాస్టళ్ల వార్డెన్ల నిర్లక్ష్య వైఖరి, పర్యవే క్షణాధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుం డటం ఇందుకు కారణమని చెప్పాలి.


గతంలో ఘటనలు...

గతంలో ఎస్సీ బాలికల వసతిగృహాల నుంచి కొం ద రు విద్యార్థినులు మిస్సింగ్‌ అ యిన ఘటనలు చోటు చేసు కున్నాయి. మరికొంత మంది విద్యార్థినులు మృత్యువాత పడిన సందర్భాలున్నాయి. తమ చెల్లెలిని ఊరికి తీసుకెళ్తానని చెప్పి ఓ అ బ్బాయి ఇంటర్‌ విద్యార్థినిని హాస్టల్‌ నుంచి పిలుచు కెళ్లాడు. ఆ సమయంలో ఆ విద్యార్థిని మృతి చెందింది. మరో డి విజనలోని ఓ ఎస్సీ విద్యార్థిని విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆ విద్యార్థిని సైతం తమ బంధువులు వచ్చా రంటూ చెప్పి హాస్టల్‌ నుంచి వెళ్లింది. కానీ ఇంటికెళ్ల లేదు. దాదాపు వారం తరువాత ఆ విద్యార్థిని ఆచూకీ కనుగొని హాస్టల్‌కు తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే హాస్టల్‌ లో నీళ్లు లేవంటూ గత యేడాది ఓ అర్ధరాత్రి విద్యార్థి నులు హాస్టల్‌ నుంచి బయటికొచ్చి నీటిని పట్టుకెళ్లిన సంఘటన ఉంది. ఆ సమయంలో ఆ విద్యార్థినులకు ఏదైనా ప్రమాదం జరిగిఉంటే అన్న వాదనలు అప్పట్లో బలంగా వినిపించాయి. వీటన్నిం టికి వార్డెన్ల నిర్లక్ష్య వైఖరి కారణమని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఆయా సంక్షేమశాఖల అధికారులు విద్యా ర్థినుల వసతిగృహాల విషయంలో నిబంధనలను కట్టు దిట్టం చేసి, వారి భద్రతను పటిష్ట పరచాల్సిన అవస రం ఎంతైనా ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 04 , 2024 | 12:07 AM