Share News

Stamps and Registration : నో స్టాంప్‌..!

ABN , Publish Date - Sep 20 , 2024 | 12:16 AM

స్టాంపులు, రిజిస్ట్రేషనల శాఖలో ప్రైవేటు పెత్తనం కొనసాగుతోంది. వారు జారీ చేస్తేనే స్టాంపులు వేసుకునే దుస్థితి నెలకొంది. రెండు వారాలుగా జిల్లాలో ఈ-స్టాంపుల కొరత ఏర్పడింది. దీంతో క్రయ విక్రయదారులు ఇక్కట్లు పడుతున్నారు. అదనపు ధరలకు విక్రయించినా ఇన్నాళ్లూ కొనుగోలు చేశారు. ఇప్పుడేమో నో స్టాక్‌ అంటున్నారు. 2022లో వైసీపీ ప్రభుత్వం ఈ-స్టాంపింగ్‌ విధానాన్ని తెచ్చింది. వాటి బాధ్యతను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించింది. కామన సెంటర్‌ సర్వీ్‌స(సీఎ్‌సఈ), స్టాక్‌ హోల్డిం...

 Stamps and Registration : నో స్టాంప్‌..!
E Stamp

కృత్రిమ కొరత సృష్టిస్తున్న ప్రైవేటు సంస్థలు..?

స్టాంపు డ్యూటీ చెల్లిస్తేనే ఏజెన్సీలకు సరఫరా..!

స్టాక్‌ హోల్డింగ్‌, సీఎ్‌ససీ చేతిలో వ్యవహారం

వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ప్రజలకు కష్టాలు

నాన జ్యుడీషియల్‌ స్టాంపులదీ అదే పరిస్థితి

అనంతపురం క్రైం, సెప్టెంబరు 19: స్టాంపులు, రిజిస్ట్రేషనల శాఖలో ప్రైవేటు పెత్తనం కొనసాగుతోంది. వారు జారీ చేస్తేనే స్టాంపులు వేసుకునే దుస్థితి నెలకొంది. రెండు వారాలుగా జిల్లాలో ఈ-స్టాంపుల కొరత ఏర్పడింది. దీంతో క్రయ విక్రయదారులు ఇక్కట్లు పడుతున్నారు. అదనపు ధరలకు విక్రయించినా ఇన్నాళ్లూ కొనుగోలు చేశారు. ఇప్పుడేమో నో స్టాక్‌ అంటున్నారు. 2022లో వైసీపీ ప్రభుత్వం ఈ-స్టాంపింగ్‌ విధానాన్ని తెచ్చింది. వాటి బాధ్యతను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించింది. కామన సెంటర్‌ సర్వీ్‌స(సీఎ్‌సఈ), స్టాక్‌ హోల్డింగ్‌ కంపెనీలే ఈ-స్టాంపులు ఇచ్చేలా ఆదేశాలిచ్చింది. వాటిపై ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. దీంతో ఈ-స్టాంపులను ఆ సంస్థలు, ఏజెన్సీ దక్కించుకున్న వారు మాత్రమే విక్రయిస్తున్నారు. కొంతకాలంగా నాన జ్యుడీషియల్‌ స్టాంపులు కనిపించడం లేదు. కనీసం రూ.10 స్టాంపులు దొరికినా చాలని బాధితులు వేచి చూసే పరిస్థితి నెలకొంది.


ఇతర జిల్లాలకు వెళ్లి..

జిల్లాలో ఈ-స్టాంపులు లభించకపోవడంతో కొందరు ఇతర జిల్లాలకు వెళ్లి కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో నెలన్నర నుంచి స్టాంపుల కొరత నెలకొంది. గుత్తి, పామిడి తదితర ప్రాంతాల వారు కర్నూలు, నంద్యాల జిల్లాలోని ప్యాపిలి, పత్తికొండ, డోనకు వెళ్లి కొని తెచ్చుకుంటున్నారు. ఈ-స్టాంపులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నా రిజిస్ట్రేషన చేయిస్తామని డాక్యుమెంట్‌ రైటర్లు చెబుతున్నారు. రెండు ప్రైవేట్‌ సంస్థలు తమ ఏజెన్సీ నిర్వాహకులకు ఓ విషయం సూటిగా చెబుతున్నట్లు సమాచారం. ‘రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంపు డ్యూటీ మీ నుంచి చెల్లిస్తేనే మీకు 300 నుంచి 500 ఈ-స్టాంపులు అందజేస్తాం. లేదంటే ఈ-స్టాంపులను ఇవ్వం’ అని చెప్పేశారట. స్టాంపు డ్యూటీ సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా చెల్లించాలి. కానీ ఏజెన్సీ నిర్వాహకుల నుంచి స్టాంపు డ్యూటీ వచ్చేలా ప్రైవేట్‌ సంస్థలు ప్లాన చేసి, సొమ్ము చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కారణంగా ఏజెన్సీ నిర్వాహకులకు ఈ-స్టాంపులు ఇవ్వకుండా బ్రేక్‌ వేశారని సమాచారం.

నాన జ్యుడీషియల్‌ స్టాంపులెక్కడ?

నాన జ్యుడీషియల్‌ స్టాంపులను పూర్తిగా నిలిపివేయడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశం మొత్తం మీద నాసిక్‌లో మాత్రమే వీటిని తయారు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకు సరిపడా నాన జ్యుడీషియల్‌ స్టాంపులకు ఇండెంట్‌ ఇచ్చి తెప్పించుకుంటాయి. ప్రభుత్వానికి చేరిన జిల్లా రిజిసా్ట్రర్‌లకు, వారి నుంచి సబ్‌ రిజిసా్ట్రర్‌లకు వెళతాయి. అక్కడి నుంచి కార్యాలయాల్లో కొన్ని నిల్వ ఉంచి, స్టాంపు వెండర్లకు ఇచ్చేవారు. అయితే ఆ స్టాంపులు ఇప్పుడు కనిపించడం లేదు. రూ.100 విలువైన నాన జ్యుడీషియల్‌ స్టాంపు కనిపించక మూడేళ్ళవుతోందని డాక్యుమెంట్‌ రైటర్లు చెబుతున్నారు.

దోపిడీ వ్యూహమా..?

ఈ-స్టాంపుల విషయంలో రెండు ప్రైవేట్‌ సంస్థలు కుంభకోణానికి తెరలేపాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కృత్రిమ కొరత సృష్టించి, అదనపు డబ్బు వసూలు చేసే ఉద్దేశంతో ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సాధారణ అవసరాల కోసం ప్రజలు రూ.10, రూ.20 ఈ-స్టాంపులను కొనుగోలు చేస్తుంటారు. డాక్యుమెంట్ల రిజిస్ట్రేన కోసం అయితే రూ.50, రూ.100 ఈ-స్టాంపులు కొంటుంటారు. ప్రస్తుతం స్టాంపులు ఎక్కడా అందుబాటులో లేవు. జిల్లా వ్యాప్తంగా వంద మందికి పైగా కామన సర్వీస్‌ సెంటర్‌(సీఎ్‌ససీ), స్టాక్‌హోల్డింగ్‌ కంపెనీలు ఏజెన్సీలు అప్పగించారు. రూ.50 స్టాంపుకు అదనంగా రూ.30, రూ.100 స్టాంపుకు అదనంగా రూ.50 నుంచి రూ.100 వసూలు చేస్తున్నారు. సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో ఒక్క స్టాంపు కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వ జోక్యం లేకపోవడంతో ప్రైవేటు ఏజెన్సీలు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. అనంతపురం, శింగనమల, గుత్తి, గుంతకల్లు, పామిడి, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కణేకల్లు సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

సమస్య తీవ్రంగా ఉంది..

జిల్లాలో ఈ-స్టాంపుల కొరత తీవ్రంగా ఉంది. రెండు వారాలుగా ఇబ్బందులు పడుతున్నాం. వారం రోజులుగా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడం, ప్రభుత్వ జోక్యం లేకపోవడంతో ఈ-స్టాంపుల కొరత ఏర్పడుతోంది. రూ.10 నాన జ్యుడీషియల్‌ స్టాంపులు సైతం దొరకని పరిస్థితి. ఈ సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలకు ఇక్కట్లు తప్పవు.

- దాసరి సుధాకర్‌, రాష్ట్ర దస్తావేజు లేకరుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 20 , 2024 | 12:16 AM