Crime : అయ్యో.. దేవుడా..!
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:17 AM
కూతురు నిశ్చితార్థానికి సిద్ధమైన ఆ కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. వెంకటరెడ్డిపల్లి సమీపంలో శనివారం రాత్రి బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో యువతి గీతావాణి(24) అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె తమ్ముడు నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. వెంకటరెడ్డిపల్లికి చెందిన శ్రీరామిరెడ్డి, లక్ష్మిదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. ఒక కు మారుడు. పెద్ద కూతురు గీతావాణి పెళ్లి కుదిరింది. తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డులో ఉన్న ఎస్‌ఎల్‌వీ ఫంక్షన హాలులో ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వ్యక్తిగత పని నిమిత్తం గీతావాణి తన తమ్ముడు ...
తెల్లవారితే నిశ్చితార్థం
బైకును ఢీకొన్న బండల ట్రాక్టర్
యువతి మృతి.. తమ్ముడికి తీవ్ర గాయాలు
తాడిపత్రి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): కూతురు నిశ్చితార్థానికి సిద్ధమైన ఆ కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. వెంకటరెడ్డిపల్లి సమీపంలో శనివారం రాత్రి బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో యువతి గీతావాణి(24) అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె తమ్ముడు నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. వెంకటరెడ్డిపల్లికి చెందిన శ్రీరామిరెడ్డి, లక్ష్మిదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. ఒక కు మారుడు. పెద్ద కూతురు గీతావాణి పెళ్లి కుదిరింది. తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డులో ఉన్న ఎస్‌ఎల్‌వీ ఫంక్షన హాలులో ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వ్యక్తిగత పని నిమిత్తం గీతావాణి తన తమ్ముడు నారాయణరెడ్డితో కలిసి బైక్‌పై తాడిపత్రికి వచ్చింది. పని ముగించుకుని రాత్రి 8:30 గంటల సమయంలో తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. రోడ్డు
దాటుతుండగా నాపరాతి బండలలోడుతో తాడిపత్రికి వస్తున్న ట్రాక్టర్ వీరిని ఢీకొట్టింది. ట్రాక్టర్ గీతావాణిపై దూసుకెళ్లడంతో శరీరం ఛిద్రమై ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన ఆమె తమ్ముడు నారాయణరెడ్డిని అనంతపురం తరలించారు. రూరల్ సీఐ శివగంగాధర్‌రెడ్డి ప్రమాద స్థలాన్ని సిబ్బందితో కలిసి పరిశీలించారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. రైతు బిడ్డ..
శ్రీరామిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ తన ముగ్గురు బిడ్డలను చదివించారు. కూతుళ్లు గీతావాణి, బిందు బాగా చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లయ్యారు. నారాయణరెడ్డి బీటెక్ పూర్తిచేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. గీతావాణికి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో వివాహం కుదిరింది. నిశ్చితార్థానికి రెండు కుటుంబాలవారు సిద్ధమయ్యారు. అందరూ సంబరాలకు సిద్ధమౌతుండగా.. రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపి ంది. ప్రమాదం గురించి తెలియగానే గ్రామస్థులు తీవ్ర ఆవేదనకు లోనయ్యా రు. అందరూ ప్రమాద స్థలానికి వెళ్లారు. విగతజీవిగా ఉన్న కూతురును చూసిన తల్లిదండ్రులు శ్రీరామిరెడ్డి, లక్ష్మిదేవి గుండెలవిసేలా రోదించారు. ‘పెళ్లిచేసి అత్తవారింటికి పంపాలనుకున్నాం కదా మ్మా... ఇంతలోనే ఎంతపని జరిగింది..’ అంటూ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ ప్రాంతం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..