Share News

DEVOTIONAL : అయ్యప్పస్వామికి లక్ష పుష్పార్చన

ABN , Publish Date - Dec 17 , 2024 | 12:26 AM

మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం ఆవరణలోని హరిహర సుత అయ్యప్పస్వామి దేవాలయం లో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి లక్షపుష్పార్చన కార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించారు.

DEVOTIONAL : అయ్యప్పస్వామికి లక్ష పుష్పార్చన
Devotees visiting the Lord

అనంతపురం కల్చరల్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం ఆవరణలోని హరిహర సుత అయ్యప్పస్వామి దేవాలయం లో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి లక్షపుష్పార్చన కార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వామి మూల విరాట్‌కు ఫలపంచామృతాభిషేకాలు, భస్మాభిషేకంతో పాటు గురుస్వామి కుర్లపల్లి రంగాచారి నేతృత్వంలో లక్ష పుష్పార్చన చేశారు. ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ దేవతాదీక్షధారులకు భిక్ష అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ లక్ష్మి రెడ్డి, కొర్రపాటి శ్రీని వాస్‌, ఏఎంసీ ప్రకాష్‌నాయుడు, హర్ష వర్దనరెడ్డి, మహేష్‌, హర్షరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ఉమేష్‌ నారాయణ, నాగ, చిన్ని, హరి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 17 , 2024 | 12:26 AM