PARKING : ప్రయాణికులకు పార్కింగ్ కష్టాలు
ABN , Publish Date - Dec 29 , 2024 | 12:48 AM
ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులకు వాహన పార్కింగ్ కష్టాలు తొలిగేనా.! అనే అనుమా నాలు వాహనదారుల్లో వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేం ద్రంలోని ఆర్టీసీ బస్టాండు మీదుగా రోజుకు దాదాపు 85వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు.
నష్టాలు భరించలేక
మూసివేత దిశగా స్టాండ్లు
వెలుపల పార్క్ చేస్తే జరిమానాలు
అనంతపురం కల్చరల్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులకు వాహన పార్కింగ్ కష్టాలు తొలిగేనా.! అనే అనుమా నాలు వాహనదారుల్లో వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేం ద్రంలోని ఆర్టీసీ బస్టాండు మీదుగా రోజుకు దాదాపు 85వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఏదైనా పనిపై ఊళ్లకు వెళ్లొచ్చేవారు, వేరే ఊళ్లలో డ్యూటీలకు బస్సుల్లో వెళ్లావారు రోజుకు దాదాపు మూడు వేల మంది తమ ద్విచక్ర వాహనాలను బస్టాండు ఆవరణలోని పార్కిం గ్ స్టాండ్లలో ఉంచి వెళ్తుంటారు. ఇందుకోసం బస్టాం డు పరిధిలో గతంలో నాలుగు స్టాండ్లు ఉండేవి. దాదా పు రెండేళ్ల క్రితం ఒకటి తగ్గిపోగా ప్రస్తుతం మూడు ఉన్నాయి. ఈ ఏడాది జూన 12న పార్కింగ్ స్టాండ్ల ని ర్వహణ కోసం నిర్వహించిన వేలం టెండర్ల ప్రక్రియలో ఆర్‌ఎం కార్యాలయం పక్కనే ఉన్న పెద్ద పార్కింగ్ స్టాండ్‌ను జీఎస్టీతో కలిపి నెలవారీ అద్దె రూ. 4.05 లక్షలకు సుంకన్న అనే వ్యక్తి, పక్కనే ఉన్న మినీ స్టాండ్‌ను రూ. 60 వేలకు వెంకటరమణ, బస్టాండు ఎంట్రీ గేట్‌లో ఉన్న పార్కింగ్ స్టాండ్‌ను రూ.83వేలకు వెంకటరామయ్య ఐదేళ్ల అగ్రిమెంట్‌తో దక్కించుకున్నా రు. అయితే ఈ నెల 8వ తేదీన సుంకన్న అనే వ్యక్తి నష్టాలు కారణం చూపుతూ తన టెండరును రద్దు చేసు కుని స్టాండ్‌ను మూసివేశా డు. గతంలో ఇదే స్టాండు రూ. 1.50 లక్షలకు టెండరు పోగా ఈ ఏడాది మాత్రం జీఎస్టీ కాకుండా రూ. 3.35 లక్షలు పలకడంతో నిర్వాహకులు నష్టపోవాల్సి వస్తోం ది. నిబంధనల మేరకు అన్ని స్టాండ్లలోనూ పార్కింగ్ ఫీజు ఒకే రకంగా వసూలు చేయాల్సి ఉండడం, నష్టాలను అధిగమించేందుకు పార్కింగ్ ఫీజు పెంచే వెసులుబాటు లేకపోవడంతో టెండరు గడువు ముగి యకనే నిర్వాహకులు స్టాండ్లను మూసివేస్తున్నారు. దీంతో బస్టాండుకు వచ్చే ద్విచక్ర వాహనదారులకు పార్కింగ్ కష్టాలు మొదలయ్యాయి.
జరిమానాలతో సతమతం
దాదాపు 550 వాహనాల పార్కింగ్ సామర్థ్యం కలిగిన స్టాండ్ మూతపడడంతో, బస్టాండుకు వచ్చే ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు. ప్రస్తుతానికి ఉన్న రెండు స్టాండ్లు వాహనాలతో నిండి పోవడంతో వాహనదారులు గత్యంతరం లేక స్టాండ్ల వెలుపలే పార్కింగ్ చేసి వెళుతున్నారు. మరికొందరు బస్టాండు వెనుకభాగాన రిజర్వేషన కౌంటర్ వెలుపల పార్కింగ్ చేస్తున్నారు. ఇలాంటివారిపై ఆర్టీసీ భద్రతా సిబ్బంది జరిమానాలతో విరుచుకుపడుతున్నారు. ఇ లాంటి తరుణంలో తాత్కాలికంగా అయినా పెద్ద స్టాండ్‌ను తెరిపించి సమస్యను పరిష్కరించాల్సిన ఆర్టీసీ అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టడం లే దు. మరోవైపు నిర్వాహకులు వద్దని నివారిస్తున్నా వా హనదారులు తమ బైక్‌లను స్టాండ్ల వెలుపుల పా ర్కింగ్ చేసి వెళుతున్నారు. దీంతో స్టాండ్ల నిర్వాహ కులపై సైతం అధికారులు జరిమానాలు విధిస్తున్నారు తప్ప ప్రత్యామ్నాయం చూపడం లేదు. పెద్దస్టాండ్ మూతపడి 20 రోజులు గడుస్తున్నా కొత్త టెండర్లు పిలవకపోవడంతో పాటు కనీసం తాత్కాలిక చర్యలు చేపట్టకపోవడంపై ప్రయాణికులు నిట్టూరుస్తున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....