Share News

MLA SUNITHA: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు

ABN , Publish Date - Nov 02 , 2024 | 12:21 AM

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛనలను అందిస్తామని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకటాపురం, శ్రీహరిపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పింఛనలను అందజేశారు.

MLA SUNITHA: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు
MLA Paritala Sunitha distributing pension

రామగిరి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛనలను అందిస్తామని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకటాపురం, శ్రీహరిపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పింఛనలను అందజేశారు. లబ్ధిదారుల ఇళ్లవద్దకు వెళ్లి పింఛనలను అందించి ప్రతినెలా 1వ తేదీన పింఛనలను ఇస్తున్నారా అని ఆరాతీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పనితీరు ఏంటని ప్రశ్నించే వారికి పింఛనలు తీసుకుంటున్న లబ్దిదారులే సాక్ష్యం అన్నారు. బీసీసెల్‌ జిల్లా అధ్యక్షుడు కుంటిమద్దిరంగయ్య, రామ్మూర్తినాయుడు, ధర్మవరపు బాలాజీ, సుబ్రమణ్యం, సుధాకర్‌, మారుతీప్రసాద్‌, పరందామయాదవ్‌, శ్రీహరిపురం అశోక్‌కుమార్‌, రఘు, ఎంపీడీఓ ఆజాద్‌, ఏఓ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 12:21 AM