COMPLAINT : డీఎస్‌డీఓపై పోలీసులకు పిర్యాదు
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:40 AM
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి (డీఎస్‌డీఓ) షఫీపై టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఆంధ్రజ్యోతిలో మంగళవారం ప్రచురితమైన ‘ఏం చేస్తే స్పందిస్తారో అనే కథనానికి అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, శాప్ చైర్మన అనిమిని రవినాయుడు, కలెక్టర్ వినోద్‌కుమార్ స్పందించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచనల మేరకు మాజీ కార్పొరేటర్ సరిపూటి రమణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మంగళవారం వనటౌన పోలీస్ స్టేషనలో సీఐ రాజేంద్రయాదవ్‌ను కలిసి రాతపూర్వకంగా పిర్యాదు అందజేశారు.
అనంతపురం క్లాక్‌టవర్/ అర్బన, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి (డీఎస్‌డీఓ) షఫీపై టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఆంధ్రజ్యోతిలో మంగళవారం ప్రచురితమైన ‘ఏం చేస్తే స్పందిస్తారో అనే కథనానికి అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, శాప్ చైర్మన అనిమిని రవినాయుడు, కలెక్టర్ వినోద్‌కుమార్ స్పందించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచనల మేరకు మాజీ కార్పొరేటర్ సరిపూటి రమణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మంగళవారం వనటౌన పోలీస్ స్టేషనలో సీఐ రాజేంద్రయాదవ్‌ను కలిసి రాతపూర్వకంగా పిర్యాదు అందజేశారు. అశోక్‌నగర్‌లోని డీఎస్‌ఏ ఇండోర్‌స్టేడియంలో జనరేటర్, క్రీడాసామాగ్రి అమ్ముకున్న విషయాన్ని పిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేంద్రయాదవ్ తెలిపారు. పోలీసులు డీఎస్‌డీఓ షఫీని స్టేషనకు పిలిపించి ప్రాథమిక విచారణ చేసి సంతకాలు చేయించుకుని పం పివేశారు. విచారణకు సహకరించాలని సూచించారు. పోలీ సులకు ఫిర్యాదు చేసిన వారిలో టీడీపీ నాయకులు కృష్ణకుమార్, మున్వర్, మణికంఠ బాబు, డిష్ ప్రకాష్, సరిపూటి శ్రీకాంత ఉన్నారు.
కలెక్టర్ ఆరా : మరోవైపు జనరేటర్, క్రీడాసామాగ్రి మాయం, నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ వినోద్‌కుమార్ ఆరా తీశారు. జనరేటర్, క్రీడా సామాగ్రి అమ్ముకోవడ ం పట్ల డీఎస్‌డీఓపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలకు సిద్దమైనట్లు సమాచారం.
చర్యలు తీసుకుంటాం : శాప్ చైర్మన
జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) చైర్మన అనిమిని రవినాయుడు స్పందించారు. డీఎస్‌ఏలో జనరేటర్, క్రీడా సామాగ్రి అమ్ముకోవడం, నిధు ల దుర్వినియోగం పట్ల డీఎస్‌డీఓ షఫీపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడుతామన్నారు. ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేశామని....వివరణ, విచారణ అనంతరం చర్యలు ఉంటాయని తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....